'గాడ్ ఫాధర్' ఫస్ట్ లుక్ లో చిరు పేరు గమనించారా.. ఇది ఆచార్య ప్రభావమేనా?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో రఫ్ ఆడిస్తున్నాడు.ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.

 Tollywood Megastar Renamed His Name, Megastar Chiranjeevi, God Father, Mohan Raj-TeluguStop.com

అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన కూడా సక్సెస్ కొట్టలేక పోయింది.మరీ ఈ రేంజ్ డిజాస్టర్ ఎవ్వరు ఊహించలేదు.సినిమా పెట్టుబడిలో సగం కూడా వెనుకకు తీసుకు రాలేక పోయారు.దాదాపు 70 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఈ దెబ్బతో మెగాస్టార్ చాలా విషయాల్లో మార్పులు చేసుకుంటున్నారు.ఆచార్య దెబ్బకు తన పేరును సైతం చిరు మార్చుకున్నారు.

ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ముగింపు దశకు చేరుకోవడంతో వరుస అప్డేట్ లను సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

Telugu God, Godfather, Chiranjeevi, Mohan Raja-Movie

ఇక నిన్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పుడు అందులో చిరంజీవి పేరును మార్చి వేయడం విశేషం.చిరు ఇంగ్లీష్ నేమ్ కు మరొక లెటర్ ను జత చేసి వేశారు.

న్యూమరాలజీ ప్రకారం చిరంజీవి పేరుకు ‘E’ అనే లెటర్ ను తగిలించారు.CHIRANJEEEVI అని పేరును మార్చి వేయడం హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.

మరి చిరు పేరు మార్పు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube