ఈ ఫొటోలో మెగాస్టార్ తో పాటూ కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా..?  

Tollywood mega prince varun tej and Chiranjeevi Childhood Photo viral, varun tej, Tollywood mega prince, Chiranjeevi, Megastar, Tollywood, Gani movie update, Acharya Movie Update, - Telugu Acharya Movie Update, Chiranjeevi, Gani Movie Update, Megastar, Tollywood, Tollywood Mega Prince, Tollywood Mega Prince Varun Tej And Chiranjeevi Childhood Photo Viral, Varun Tej

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే మొదటగా వరుణ్ తేజ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “ముకుంద” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

TeluguStop.com - Tollywood Mega Prince Varun Tej And Chiranjeevi Childhood Photo Viral

 వచ్చీరావడంతోనే మంచి క్లాసికల్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ కంచె, ఫిదా, ఎఫ్2, తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరించాడు.అయితే ఇటీవలే  వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు మరియు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పుడు వరుణ్ తేజ్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వరుణ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.అలాగే తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసినటువంటి నూతన చిత్రం “గని పోస్టర్ చాలా బాగుందని” ఈ సంవత్సరం అంతా నీకు మంచే జరగాలంటూ దీవించాడు.

TeluguStop.com - ఈ ఫొటోలో మెగాస్టార్ తో పాటూ కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో మెగా అభిమానులు వరుణ్ తేజ చిన్నప్పటి ఫోటో ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతే గాక ఈ ఫోటోని మెగాస్టార్  చిరు షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వరుణ్ తేజ్ తెలుగు లో “గని” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.

దాంతో ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్లేయర్ గా ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.మరోపక్క ఆ మధ్య ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చినటువంటి ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కుతున్న “ఎఫ్3” చిత్రంలో కూడా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు.

దీంతో అన్నీ కుదిరితే ఈ సంవత్సరం వరుణ్ తేజ్ డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Varun Tej #TollywoodMega #TollywoodMega #Megastar #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు