వామ్మో.. చిరంజీవి ఇన్ని రీమేక్ సినిమాల్లో నటించారా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో స్ట్రెయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే.రీఎంట్రీలో తమిళంలో హిట్టైన కత్తి రీమేక్ ఖైదీ నంబర్ 150లో చిరంజీవి నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైంది.

 Tollywood Meastar Chiranjeevi Remake Movies List-TeluguStop.com

ప్రస్తుతం ఆచార్య మూవీలో నటిస్తున్న చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటిస్తున్నారు.లూసిఫర్ రీమేక్ కు మోహనరాజా దర్శకత్వం వహిస్తుండగా వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే చిరంజీవి గతంలో కూడా ఒకవైపు స్ట్రెయిట్ సినిమాల్లో నటిస్తూనే రీమేక్ సినిమాల్లో కూడా నటించి ఘన విజయాలను సొంతం చేసుకున్నారు.చిరంజీవి 1981 సంవత్సరంలో తమిళంలో హిట్టైన సట్టం ఓరు ఇరుత్తరయ్ రీమేక్ చట్టానికి కళ్లు లేవు సినిమాలో నటించి విజయం సొంతం చేసుకున్నారు.

 Tollywood Meastar Chiranjeevi Remake Movies List-వామ్మో.. చిరంజీవి ఇన్ని రీమేక్ సినిమాల్లో నటించారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి కెరీర్ లో ఈ సినిమా తొలి రీమేక్ సినిమా కావడం గమనార్హం.ఈ సినిమా తరువాత శాండిల్ వుడ్ లో హిట్టైన పట్టనెక్క బంద పత్నియరు సినిమా రీమేక్ లో చిరంజీవి, మోహన్ బాబుతో కలిసి నటించారు.

Telugu Chiranjeevi, Khaidi Remake, List In Telugu, Remake Movies-Movie

తెలుగులో పట్నం వచ్చిన పతివ్రతలు అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన ఖైదీ రీమేక్ కానప్పటికీ ఫస్ట్ బ్లడ్ అనే మూవీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.హిందీలో హిట్టైన సాహెబ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విజేత కూడా తెలుగులో మంచి హిట్ అయింది.చిరంజీవి కెరీర్ లో హిట్ గా నిలిచిన పసివాడి ప్రాణం సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమా మలయాళంలో హిట్టైన పూనివా పుతికా సినిమాకు రీమేక్.

తమిళంలో హిట్టైన అమ్మన్ కొవిల్ కిజకాలె సినిమా రీమేక్ గా చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 786 సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.చిరంజీవి కెరీర్ లో హిట్లైన ఘరానా మొగుడు, హిట్లర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు కూడా రీమెక్ లు కావడం గమనార్హం.

#Khaidi Remake #List In Telugu #Remake Movies #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు