బిగ్ బాస్ 6 లో టాలీవుడ్ లవర్ బాయ్.. ఈసారి పక్కా?

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం పలు భాషలలో ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకు వెళుతోంది.

 Tollywood Lover Boy In Bigg Boss 6 This Time, Bigg Boss, Tollywood, Tharun, Telugu Film Industry, Vadde Pawan-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో కూడా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది.అదేవిధంగా ఒక నాన్ స్టాప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలిచారు.

ఈ విధంగా నాన్ స్టాప్ కార్యక్రమం పూర్తి కావడంతో నిర్వాహకులు బుల్లితెరపై తిరిగి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నహాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రసారానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Tollywood Lover Boy In Bigg Boss 6 This Time, Bigg Boss, Tollywood, Tharun, Telugu Film Industry, Vadde Pawan-బిగ్ బాస్ 6 లో టాలీవుడ్ లవర్ బాయ్.. ఈసారి పక్కా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే మరోవైపు కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని తెలుస్తుంది.అలాగే ఈ సీజన్లో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుందని ఈ కామన్ మ్యాన్ గా తెలంగాణకు చెందిన లాయర్ హాజరవుతున్నారని వార్తలు వచ్చాయి.

Telugu Bigg Boss, Telugu, Tharun, Tollywood, Vadde Pawan-Movie

ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా వడ్డే నవీన్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేయగా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న హీరో తరుణ్ ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.ఈయన బిగ్ బాస్ సీజన్ 2 లోనే పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని ఈ సీజన్ లో మాత్రం ఈయన పక్క ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

మరి ఈ సీజన్ లో అయినా నిజం ఉందా లేక ఇది కూడా ఆ వాస్తవమేనా అనే విషయం తెలియాలంటే మేకర్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube