పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నయనతార.పదిహేను ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార కెరియర్ ఆరంభంలో కంటే ఇప్పుడే ఎక్కువ సినిమాలు, అది కూడా స్టార్ హీరోలతో కలిసి చేస్తుంది.

 Nayanatara Ready To Marry Her Boy Friend, Tollywood, Kollywood, South Heroins, N-TeluguStop.com

వయసు పెరిగిన కొద్ది అందాన్ని పెంచుకుంటున్న నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.మొదట్లో శింబుతో తర్వాత ప్రభుదేవాతో ప్రేమకథలు నడిపిన నయనతార చాలా కాలంగా విఘ్నేశ్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది.

ఇక వీరు ఎప్పటికప్పుడు విదేశాలు వెళ్తూ తమ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

హీరోయిన్ గా అవకాశాలు వస్తూ ఉండటంతో పెళ్ళికి గ్యాప్ తీసుకున్న నయనతార ఇక లేట్ చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో నయనతార హిట్ రేషియో దగ్గడంతో పెళ్లి వైపు గాలి మల్లిందని విఘ్నేశ్ శివన్ ని వీలైనంత తొందరగా పెళ్లి చేసుకొని భార్య పోస్ట్ లోకి వెళ్ళిపోవాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ వేసవిలో నిశ్చితార్ధం చేసుకోవాలని ఇద్దరు అనుకుంటున్నట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.

అయితే వీరు మాత్రం అఫీషియల్ గా పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube