బాలీవుడ్, కోలీవుడ్.. అంతా హైదరాబాద్ మకాం మార్చేస్తున్నారుగా?

ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది.కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా తెలుగు సినిమాలు సత్తా చాటుతూ ఉన్నాయి.

 Tollywood, Kollywood Is In Hyderabad Now Tollywood, Kollywood , Hyderabad , Sal-TeluguStop.com

ఈ క్రమంలోనే అన్ని ఇండస్ట్రీల చూపు టాలీవుడ్ పై పడింది.ఇలాంటి సమయంలోనే తెలుగు సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఇతర ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు.

అంతేకాదండోయ్ తమ సినిమాల షూటింగ్ లను కూడా హైదరాబాద్ వేదికగానే జరుపుకుంటూ ఉండటం గమనార్హం.ఇలా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నుంచి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరకు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లోనే తమ సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇక ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కబీ ఈద్ కబీ దివాలి అన్ని సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది.ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు.

ఇక మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సైతం రామోజీ ఫిలిం సిటీ లో దృశ్యం 2 సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఉన్నాడు.బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ అమితాబచ్చన్ కీలక పాత్రలో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం బాలీవుడ్ తారలు అటు రామోజీ ఫిలిం సిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది.

Telugu Ajay Degan, Deepika, Dhanush, Drushyam, Hyderabad, Kollywood, Project, Sa

ఇక మరోవైపు తమిళ హీరో ధనుష్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సైతం షూటింగ్ సైతం హైదరాబాద్లోనే జరుగుతుందట.ఇక అజిత్ 61 సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీన్నిబట్టి అటు ఇతర ఇండస్ట్రీలో స్టార్లు టాలీవుడ్ కి ఇక్కడి సినిమాలకి ఇక్కడి సినిమా లోకేషన్స్ కి ఎంతలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube