మా హీరోలు తోపులు.. మీ హీరోలు జీరోలు  

Tollywood Kollywood Corona Virus Social Media Netizensccc Heros And Zeros - Telugu Ccc, Corona Virus, Hero\\'s And Zero\\'s, Kollywood, Netizens, Social Media, Tollywood

గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో టాలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్‌ కోలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య వైరం నడుస్తున్న విషయం తెల్సిందే.మొన్నటి వరకు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ వర్సెస్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ అన్నట్లుగా యుద్దం స్థాయిలో సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం చేశారు.

 Tollywood Kollywood Corona Virus Social Media Netizensccc Heros And Zeros

తాజాగా మరోసారి టాలీవుడ్‌ ప్రేక్షకులు ఇంకా కోలీవుడ్‌ ప్రేక్షకుల మద్య వైరం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ తమ హీరోలు తోపులు అంటూ కామెంట్స్‌ చేస్తూ తమిళ హీరోలను జీరోలు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కరోనా విపత్తు నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పలువురు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు టాలీవుడ్‌ నుండి పాతిక కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.అందులో కొందరు కరోనా క్రైసిస్‌ ఛారిటీకి కూడా లక్షలు కోట్లల్లో ఇచ్చారు.టాలీవుడ్‌ సినీ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ తిండి కూడా లేకుండా బాధపడుతున్న ఈసమయంలో వారిని ఆదుకునేందుకు మా హీరోలు ముందుకు వచ్చారు.

మా హీరోలు తోపులు.. మీ హీరోలు జీరోలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మీ హీరోలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.

మా హీరోలకు ఉన్న మానవత్వం ముందు మీ హీరోల మానవత్వం కనిపిండం లేదు అంటూ తెలుగు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇప్పటి వరకు తమిళ సినిమా పరిశ్రమ నుండి కనీసం 10 కోట్ల వరకు కూడా విరాళాలు అందలేదు అంటూ సమాచారం అందుతోంది.అందుకే తమిళ హీరోలు ఎవరైతే విరాళాలు ఇవ్వలేదో వారిని జీరోలు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై కోలీవుడ్‌ ఫ్యాన్స్‌ రివర్స్‌ పంచ్‌ వేస్తున్నారు.మా హీరోలు పబ్లిసిటీకి దూరంగా విరాళాలు ఇస్తున్నారంటూ పేర్కొంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు