ఫోటో టాక్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న అక్కినేని అందగాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో అక్కినేని అందగాడు, మన్మధుడు నాగార్జున గురించి తెలియని వారుండరు.60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ నవ మన్మధుడు లా కనిపిస్తూ కుర్రాడిలా నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున.ప్రస్తుతం నాగార్జున ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బుల్లితెర లో ప్రసారమయ్యే బిగ్ బాస్  రియాలిటీ గేమ్ షో నాలుగవ సీజన్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

 Akkineni Nagarjuna Childhood Photos,akkineni Nagarjuna, Tollywood King, Telugu H-TeluguStop.com

తాజాగా నాగార్జున కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

 అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు నాగార్జున తన తల్లి అన్నపూర్ణమ్మ గారితో కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని నాగార్జున అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.

  అంతే గాక “అక్కినేని అందగాడు చిన్నప్పటి ఫోటో అదిరిపోయింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్కినేని నాగార్జున బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న టువంటి “బ్రహ్మాస్త్ర” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే తెలుగులో “వైల్డ్ డాగ్” అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube