హీరో నాగార్జున అమల పెళ్లి చాలా సింపుల్ గా జరిగిందట... ఇదిగో ప్రూఫ్...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యి 50 ఏళ్ల వయసు దాటిన అప్పటికి ఇప్పటికీ నవ మన్మధుడుగా కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న టాలీవుడ్ “కింగ్ నాగార్జున” గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నాగార్జున సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని తనకంటూ అభిమానులను బాగానే సంపాదించుకున్నాడు.

 Tollywood King Nagarjuna And Amala Marriage Is Very Simple-TeluguStop.com

ఈ క్రమంలో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోలకు తన చిత్రాలతో గట్టిపోటీ ఇచ్చాడు.

అయితే నటుడు నాగార్జున 1992వ సంవత్సరంలో ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అమల ని  ప్రేమించి ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

 Tollywood King Nagarjuna And Amala Marriage Is Very Simple-హీరో నాగార్జున అమల పెళ్లి చాలా సింపుల్ గా జరిగిందట… ఇదిగో ప్రూఫ్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవలే వీరిద్దరి పెళ్లి జరిగి 26 సంవత్సరాలు పూర్తి కావడంతో ఓ అభిమాని అప్పట్లో అక్కినేని నాగార్జున పెళ్లి జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు మరియు అభిమానులు నాగార్జునకి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telugu Akhil, Amala, Bangarraju, Nagarjuna, Nagarjuna And Amala Marriage, Telugu Movie, Tollywood King, Tollywood King Nagarjuna And Amala Marriage Is Very Simple-Movie

కాగా వీరిద్దరికీ జన్మించిన అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ హీరో గా బాగానే రాణిస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కింగ్ నాగార్జున తెలుగులో వైల్డ్ డాగ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు.కాగా ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.అయితే ఈ చిత్రం కథ పరంగా టాక్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం సాధించలేక పోయింది.

Telugu Akhil, Amala, Bangarraju, Nagarjuna, Nagarjuna And Amala Marriage, Telugu Movie, Tollywood King, Tollywood King Nagarjuna And Amala Marriage Is Very Simple-Movie

కాగా ప్రస్తుతం నాగార్జున తెలుగులో “బంగార్రాజు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో రమ్య కృష్ణ, సమంత అక్కినేని, నాగ చైతన్య అక్కినేని తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Akhil #Bangarraju #TollywoodKing #Nagarjuna #NagarjunaAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు