ఇండియన్ సినీ ఇండస్ట్రీని శాసించేది తెలుగు సినిమాలేనా.. హిట్ ఫార్ములాతో?

కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసినా హిందీ ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించరని ఇండస్ట్రీలో అపోహ ఉంది.అయితే బాహుబలి ది బిగినింగ్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ఆ అభిప్రాయాన్ని మార్చేశారు.

 Tollywood Industry Movies Domination Details Here Goes Viral Tollywood, Bahubali-TeluguStop.com

మంచి కంటెంట్ తో, భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం కష్టం కాదని ఈ స్టార్ డైరెక్టర్ ప్రూవ్ చేశారు.బాహుబలి ది బిగినింగ్ సక్సెస్ తో బాలీవుడ్ ప్రేక్షకులు బాహుబలి ది కంక్లూజన్ ను కూడా అఖండ విజయం సాధించేలా చేశారు.

బాహుబలి ది కంక్లూజన్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.రాబోయే రోజుల్లో ఇండియన్ సినీ ఇండస్ట్రీని శాసించేది తెలుగు సినిమాలే అని టాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తున్నారు.

రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, మరి కొందరు దర్శకులు తెలుగు హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ హీరోల పాత్రలు రఫ్ గా ఉండటం కూడా ఇతర ఇండస్ట్రీలలో మన సినిమాలు అంచనాలను మించి విజయం సాధించడానికి ఒక కారణమవుతోంది.

కళ్లు చెదిరే విజువల్స్ తో, ఆశ్చర్యపరిచే యాక్షన్ సన్నివేశాలతో టాలీవుడ్ డైరెక్టర్లు సినిమాలను తెరకెక్కిస్తూ ఉండటంతో పెద్ద సినిమాలు ఊహించని ఫలితాలను సొంతం చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. పుష్ప2, కేజీఎఫ్3, సలార్, రాజమౌళి మహేష్ కాంబో సినిమాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హిందీలో ఊరమాస్ సినిమాలను చేసే హీరోలు లేకపోవడం కూడా టాలీవుడ్ స్టార్ హీరోలకు ఒక విధంగా ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతూ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

Telugu Allu Arjun, Bahubali, Mahesh Babu, Prabhas, Prashanth Neel, Pushpa, Rajam

ప్రస్తుతం ఇంగ్లీష్ పత్రికలు సౌత్ సినిమాలకు మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.హిందీ డిస్ట్రిబ్యూటర్లు సైతం సౌత్ సినిమాల హక్కులను కొనుగోలు చేయడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని కాన్ఫిడెన్స్ తో ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube