రాజమౌళి దర్శకధీరుడే.. కానీ అయన వల్ల టాలీవుడ్ మునిగిపోయిందట?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన దర్శకుడు రాజమౌళి.

 Tollywood Industry Loss Of Business Because Of Director Rajamouli , Tollywood, I-TeluguStop.com

అంతేకాకుండా బాహుబలి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి తెలుగులో పాన్ ఇండియా సినిమాలు కు పునాది వేసిన డైరెక్టర్ కూడా రాజమౌళినే.భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఆయన రూపొందిస్తున్న సినిమాలు అన్ని మంచి విజయం సాధిస్తుండడంతో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు.కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం రాజమౌళి వల్ల తెలుగు సినీ ఇండస్ట్రీ మునిగిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 Tollywood Industry Loss Of Business Because Of Director Rajamouli , Tollywood, I-TeluguStop.com

కాగా బాహుబలి సినిమా కోసం రాజమౌళి ఐదేళ్ల సమయం తీసుకున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కూడా వేరే ప్రాజెక్టుకు కమిట్ అవ్వకుండా పూర్తిగా ఆ సినిమాకు అంకితమయ్యాడు.

మామూలుగా అయితే ఆ ఐదు సంవత్సరాలలోపు దాదాపుగా ఒక అయిదారు సినిమాలు తీసి ఉండవచ్చు.కానీ రాజమౌళి కారణంగా ప్రభాస్ రెండు చిత్రాలలో మాత్రమే నటించాడు.కాగా ఒక అగ్ర హీరో తరచుగా సినిమాలు చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజినెస్ జరగడంతో పాటు నటీనటుల నుంచి టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్కరికి ఎంతో మందికి పని దొరుకుతుంది.అలాగే సినిమాలు ఎక్కువగా చేయడం వల్ల అధిక మొత్తంలో సంపాదించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది.

Telugu Bhahubali, Rajamouli, Heros, Tollywood-Movie

తరచుగా సినిమాలు చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ఎగ్జిబిటర్స్ కు ఇలా ఎంతో మందికి లాభం చేకూరుతుంది.అయితే బాహుబలి 2 సినిమా తర్వాత ఈ ఐదేళ్లలో ప్రభాస్ కేవలం రెండు సినిమాలు మాత్రమే చేయడంతో దాదాపుగా కొన్ని కోట్ల బిజినెస్ తగ్గిందని చెప్పవచ్చు.అయితే ఇందుకు పరోక్షంగా రాజమౌళి కూడా కారణమయ్యారు అని చెప్పవచ్చు.కాగా రాజమౌళి బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నప్పటికీ ఈ సినిమా కోసం హీరోలను ఇద్దరినీ మూడేళ్ల పాటు బ్లాక్ చేశాడు.

అయితే ఇందులో హీరోగా నటించిన రామ్ చరణ్ మాత్రం మధ్య మధ్యలో వేరే సినిమాలలో నటించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube