చంద్రబాబు ని కేర్ చెయ్యని తెలుగు సినిమా పరిశ్రమ ?

మొన్నటికి మొన్న జరిగిన రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుక కి అతిధి గా వచ్చిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తు ఉన్నాయా ? ఆయన ఈ సందర్భంగా ఒక కామెంట్ చేసారు.తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కడ వారు అయినా ఎప్పుడు అయినా ఏపీ లో షూటింగ్ జరుపుకోవచ్చు అనీ, అలాంటి పరిస్థితి లో రాయతీలు కూడా ఇస్తాం అనీ అన్నారు ఆయన.

 Telugu Cinema Doesn’t Care Chandrababu-TeluguStop.com

ఇక్కడ పరిశ్రమ పెట్టాలి అనుకుని ఎస్టాబ్లిష్మెంట్ మొదలు పెట్టినా భారీగా రాయతీ ఇస్తాం అన్నారు ఆయన.ఇంత ఓపెన్ ఆఫర్ ని చంద్రబాబు ఇచ్చినా కూడా ఎవ్వరూ కనీసం పట్టించుకోవడం లేదు.తెలంగాణా రాష్ట్రమే ఏర్పడక ముందర హైదరాబాద్ లో ఆంధ్రా సినిమాలు షూటింగ్ కాదు కదా రిలీజ్ కూడా ఉండదు అని ప్రకాహ్రం సాగింది.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో కలసి మినిష్టర్ గంటా శ్రీనివాసరావు వైజాగ్ దగ్గర మెగా ఫిలిం సిటీ కడతారని.

వేరే ప్రైవేటు బిల్డర్లతో కలసి నెల్లూరి దగ్గర సురేష్ బాబు కొత్త ఫిలిం సిటీ కడుతున్నారని.స్వయంగా రామోజీరావే ఆంధ్ర ప్రాంతంలో మరో ఫిలిం సిటీ రూపొందిస్తారని వార్తలొచ్చాయి.

కాని తెలంగాణ స్టేట్ వచ్చాక మాత్రం ఇవన్నీ వినిపించట్లేదు.కనిపించట్లేదు.

అస్సలు టాలీవుడ్ ఎక్కడికో వెళ్తుందని ఎవ్వరికీ అనిపించట్లేదు.దానికి కారణాలు అనేకం.

స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెళ్లి రామోజీరావును కలవడం.యంగ్ మినిస్టర్ కెటిఆర్ సినీ పరిశ్రమలో రామ్ చరణ్ వంటి హీరోలతో క్లోజ్ గా మెలగడం.

హైదరాబాద్ లో గతంలో సినీపరిశ్రమ పెద్దల తాలూకు ఆస్తులపై కన్నెర్రజేసిన హరీశ్ రావు వంటి వారు ఇప్పుడు వారితోనే హై ఫైవ్ లు కొట్టడం.మొదలగు పరిణామాలన్నీ.

ఇక్కడ వాతావరణాన్ని స్విట్జర్లాండ్ కంటే కూల్ గా మార్చేశాయి.దానితో టాలీవుడ్ అసలు హైదరాబాద్ ను వదిలి వెళుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే ఛాన్సు లేకుండా పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube