టాలీవుడ్ పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఇవే.. ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుందంటే?

సాధారణంగా పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైన తర్వాత రిలీజ్ డేట్లను వాయిదా వేయడం జరగదు.అయితే కరోనా వైరస్ వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినా తమ సినిమాలను వాయిదా వేస్తున్నారు.

 Tollywood Huge Budget Movies Release Dates And Release Dates Details Here , Tollywood ,samanuydu , Bheemla Nayak , Khiladi , Ghani , Adavlallu Meeku Goharlu-TeluguStop.com

ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్లు సైతం మళ్లీ మారే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ ఉండటం గమనార్హం.

జనవరి నెలలో రిలీజైన సినిమాలలో బంగార్రాజు మినహా ఏ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు.

 Tollywood Huge Budget Movies Release Dates And Release Dates Details Here , Tollywood ,samanuydu , Bheemla Nayak , Khiladi , Ghani , Adavlallu Meeku Goharlu-టాలీవుడ్ పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఇవే.. ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న బంగార్రాజు సైతం ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం కష్టమేనని సమాచారం.ఫిబ్రవరి నెల విషయానికి వస్తే ఈ నెలలో ఫిబ్రవరి 4వ తేదీన సామాన్యుడు సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.

ఫిబ్రవరి 11వ తేదీన డిజె టుల్లు సినిమాతో పాటు రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన రవితేజ ఖిలాడీ సినిమాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 25వ తేదీన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ ను ప్రకటించారని వినిపిస్తోంది.భీమ్లా నాయక్ రిలీజ్ కు సంబంధించి అతి త్వరలో స్పష్టత రానుంది.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ ను కుదిరితే మార్చి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి వస్తే మాత్రమే రాధేశ్యామ్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.ఆర్ఆర్ఆర్ మూవీ ఏప్రిల్ 28వ తేదీనే రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.వరుణ్ తేజ్ గని కూడా ఏప్రిల్ లోపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

ర్కారు వారి పాట ఏప్రిల్ 1వ తేదీన రిలీజవుతుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.

Video : Tollywood Huge Budget Movies Release Dates And Release Dates Details Here , Tollywood ,samanuydu , Bheemla Nayak , Khiladi , Ghani , Adavlallu Meeku Goharlu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube