చిరంజీవి నుండి వెంకటేష్ వరకు ముసలి పాత్రల్లో మెరిసిన టాలీవుడ్ హీరోలు ..!- Tollywood Heros Who Performed Old Roles In Young Age

Tollywood Heros who played older roles than age - Telugu Bala Krishna Played Older Roles Than Age News, Kamal Haasan Played Older Roles Than Age News, Mohan Babu Played Older Roles Than Age, Nagarjuna Played Older Roles Than Age News, Raja Shekar Played Older Roles Than Age, Rajini Kanth Played Older Roles Than Age, Venkatesh Played Older Roles Than Age News

మనం బాగా అభిమానించే హీరోలు.సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరోలు.

 Tollywood Heros Who Performed Old Roles In Young Age-TeluguStop.com

మాములు సాధ సీదా నుండి కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకొని స్టార్ అయిపోయిన హీరోలు.ఒక స్టేజి వచ్చాక ఏ క్యారెక్టర్ బడితే ఆ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడరు.

వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసిన వాళ్ళ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని

మాస్ మాసాల

అన్ని ఉండేలా చూసుకుంటారు.అలాంటి హీరోల వయసు పెరుగుతున్న కొద్దీ ఏం చేసైనా

యంగ్

గా కనిపించాలని వాళ్ళ అభిమానుల కోసం కొత్త కొత్త స్టైల్స్ లో కనిపిస్తూ వుంటారు.

 Tollywood Heros Who Performed Old Roles In Young Age-చిరంజీవి నుండి వెంకటేష్ వరకు ముసలి పాత్రల్లో మెరిసిన టాలీవుడ్ హీరోలు ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే యంగ్ లో ఉన్న

హీరోలకు ఓల్డ్ క్యారెక్టర్లు

వస్తే.అమ్మో వాళ్ళ ఫాన్స్ ఒప్పుకోరు అంటూ కొంతమంది హీరోలు అలాంటి క్యారెక్టర్లు చేయరు.

బట్ నిజమైన సూపర్ స్టార్లు ఎవరైనా కూడా ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించడానికి రెడీ గా వుంటారు.సో, అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసి మంచి విజయాలతో దూసుకుపోతున్న టైం లో అలాంటి క్యారెక్టర్లు వస్తే ఏ మాత్రం వెనకాడకుండా ధైర్యంగా చేసి సూపర్ అనిపించుకున్న కొంతమంది హీరోల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.

1)చిరంజీవి :

చిరు ఎంత పెద్ద యాక్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈయన కెరియర్ స్టార్టింగ్ లో కూడా కామెడీ, యాక్షన్, నెగటివ్ రోల్స్ ఇలా వివిధ రకాలుగా ఒక మంచి నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు.ఇక మెగాస్టార్ స్నేహం కోసం సినిమాలో ఓల్డ్ గెటప్ లో కనిపించారు.

ఇందులో తండ్రి పాత్రలో ఓల్డ్ గా కొడుకు పాత్రలో యంగ్ గా కనిపించి ఆయన నటనా స్థాయిని ఇంకొంచం పెంచుకున్నారు.ఇంకా ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ లో అయితే మెగాస్టార్ జీవించేసారు.

2)బాలకృష్ణ :

మన బాలయ్య బాబుగారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.పాత్ర ఏదైనా దానిలో పరకాయ ప్రవేశం చేయడంలో బాలయ్య బాబు దిట్ట.అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య బాబు యాక్టింగ్ ని ఇష్టపడని వాళ్ళు ఉండరు.ఇక బాలయ్య గారు పెద్దన్నయ్య, చెన్నకేశవరెడ్డి లాంటి చిత్రాల్లో ఓల్డ్ క్యారేటర్లో నటించారు.

అయితే ఈ రెండు కూడా పవర్ ఫుల్ పాత్రలు కావడం విశేషం.రెండు చిత్రాల్లోనూ ఓల్డ్ గెటప్ పాత్రే హైలెట్ కావడం మరో విశేషం.

3) విక్టరీ వెంకటేష్:

వెంకటేష్ గారంటే మనందరికి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు గుర్తొచ్చిన ఈయన యాక్టింగ్ ని వేరేలేవేల్లో నిలబెట్టిన సినిమాలు మాత్రం చంటి, సూర్యవంశం సినిమాలని చెప్పొచ్చు.కెరియర్ పీక్ స్ట్రాజ్ లో ఉన్నప్పుడు సూర్యవంశం సినిమాలో ఓల్డ్ క్యారెక్టర్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో వెంకటేష్ నటించడానికి ఒప్పుకొని ఆ పాత్రను ఆయనకంటే బాగా ఎవరు చేయలేరు అన్నట్టుగా ఆ పాత్రకు న్యాయం చేసారు విక్టరీ వెంకటేష్.ఇక వెంకీ గారి మొత్తం సినిమా ప్రయాణంలో సూర్యవంశం సినిమా ఒక మైలు రాయని చెప్పొచ్చు.

4)మోహన్ బాబు :

డైలాగ్ కింగ్ మోహన్ బాబు అంటే తెలుగు సినిమా పరిశ్రమే దడ దడ లాడేలా ఆయన నటనతో క్రమశిక్షణతో ముక్కుసూటి తనంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మోహన్ బాబు గారు.ది వర్సిటైల్ హీరో ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్న కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.అలా ఉంటుంది ఆయన నటన.ఇక ఈయన కెరియర్ లో కూడా పెదరాయుడు అలాగే ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రాల్లో ఓల్డ్ గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

5) రజినీకాంత్ :

ఇండియన్ రియల్ సూపర్ స్టార్ అంటే ఎవరు అని ఎవర్ని అడిగినా వెంటనే రజనీకాంత్ అంటూ గర్వంగా చెప్పుకుంటారు మన ఇండియన్స్ ఎందుకంటే ఆయన స్టైల్ అఫ్ యాక్టింగే వేరు.ఇక రజనీకాంత్ గారు కూడా పెదరాయుడు, ముత్తు, నరసింహ లాంటి మూడు చిత్రాల్లోనూ ఓల్డ్ గెటప్ లలో నటించి దుమ్ము దులిపారు.అప్పట్లో ఆయనకున్న ఫాలోయింగ్ కి ఈ పాత్రలు చేయడం కొంచం రిస్క్ తో కూడుకున్న కూడా ఆయన చేసేసారు కాబట్టే ఆయన్ని సూపర్ స్టార్ అన్నారు.

6) కమల్ హాసన్ :

ఇక ఈ యూనివెర్సల్ హీరో గురించి చెప్పేదేముంది.ఇండియన్ హీరోస్ లో ఈయన చేసినన్ని ప్రయోగాలు ఇంతవరకు ఎవరు చేయలేదు.ఈయన సినిమా ప్రయాణంలో ఎన్నో గుర్తుండి పోయే పాత్రలు పోషించినా.మనకి ఎప్పుడూ గుర్తుంది పోయే పాత్ర మాత్రం ‘భారతీయుడు’ చిత్రంలోని సేనాపతి క్యారెక్టర్ యే.భారతీయుడిలో ఆయన చేసిన పాత్ర అబ్బబబబబ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే!

7)రాజశేఖర్ :

రాజశేఖర్ గారంటే మనందరికి గుర్తొచ్చేది మా అన్నయ్య సినిమానే.అందులో ఆయన ఓల్డ్ క్యారెక్టర్ అయినా పెద్దన్నయ్య క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించారు.అసలు యాంగ్రీ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ గారు అలాంటి పాత్రలో నటించి అందరిని మెప్పించారంటే ఆయన నటనకి ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టాల్సిందే.ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కూడా కంటతడి పెట్టించారాయన.

8) నాగార్జున :

మన్మధుడు నాగార్జున శివ లాంటి ఒక ఎపిక్ మూవీలో హీరోగా చేసిన ఆయన కమర్షియల్ గా మంచి హిట్లతో దూసుకెళ్తున్న టైం లో అన్నమయ్య అనే ఒక కథను ఓకే చేయడం ఆ సినిమాలో ఆయన నటనకు గాను స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నేషనల్ అవార్డులు రావడం ఆమ్మో మాములు విషయం కాదు.నిజంగా ‘అన్నమయ్య’ అంటే ఇలాగే ఉంటాడేమో అనేంతలా నటించారాయన.ముఖ్యంగా ఆ ఓల్డ్ గెటప్ లో అయన నటన అద్భుతం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

9)మహేష్ బాబు:

ఇక ఆంద్ర అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘నాని’ చిత్రం క్లయిమాక్స్ లో ఓల్డ్ గెటప్ లో కనిపించి అందరిని మెప్పించాడు.

10) రానా:

రానా తీసిన సినిమాలు తక్కువే అయినా అయన లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.రానా కూడా అదే రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా ‘బాహుబలి ది బిగినింగ్’ లో ఓల్డ్ క్యారెక్టర్ చేసిన రానా శభాష్ అనిపించుకున్నాడు.అనుష్కాని శాసించే సీన్స్ లో అయితే రానా యాక్టింగ్ సూపర్.

11) సుధీర్ బాబు:

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విషయమున్న హీరో మహేష్ బాబు బావ సుధీర్ బాబు.ఈయన కూడా వీర భోగ వసంత రాయలు చిత్రంలో కాసేపు ఓల్డ్ గెటప్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసాడు.

12) నారా రోహిత్ :

నారా వారి వంశం నుండి హీరోగా అరంగేట్రం చేసిన నారా రోహిత్ కూడా అప్పట్లో ఒకడుండేవాడు సినిమా క్లయిమాక్స్ లో కాసేపు ఓల్డ్ గెటప్ లో కనిపించాడు.

13) శ్రీవిష్ణు

: ఇక శ్రీవిష్ణు కూడా నారా రోహిత్ తో పాటూ అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలోనే ఓల్డ్ గెటప్ లో కనిపించాడు.

14) సుమంత్ :

అక్కినేని వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుమంత్ ఒకప్పుడు వరుసగా హిట్టులు కొట్టాడు.ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో తన తాతగారి పాత్రలో ఓల్డ్ గెటప్ లో కనిపించి ప్రశంసలు అందుకున్నాడు.

15) తొట్టెంపూడి వేణు :

జి.రాంప్రసాద్ డైరెక్షన్లో వేణు హీరోగా నటించిన ‘కళ్యాణరాముడు’ చిత్రంలో ఓల్డ్ గెటప్ లో కనిపించాడు వేణు.ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం.వేణు మంచి ఆర్టిస్ట్ అయినా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

.

#MohanBabu #VenkateshPlayed #RajaShekar #BalaKrishna #RajiniKanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు