ఎవరు పడలేనన్ని కష్టాలు పడి సక్సెస్ కొట్టిన టాలీవుడ్ హీరోస్ వీళ్ళే

ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరాలంటే ఇబ్బందులు తప్పవు.వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే అనుకున్న గమ్యానికి చేరుతారు.

 Tollywood Heros Who Came From Very Poor Back Ground-TeluguStop.com

సేమ్ ఇలాగే.సినిమాల్లోకి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడి.వచ్చిన అవకాశాన్ని వాడుకుని.మంచి స్థాయికి చేరిన నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

నాని:

నేచురల్ స్టార్ గా గుర్తిపు పొందిన నాని.తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.రాధా గోపాళం సినిమాకు అసిస్టెంట డైరెక్టర్ గా పనిచేశాడు.

 Tollywood Heros Who Came From Very Poor Back Ground-ఎవరు పడలేనన్ని కష్టాలు పడి సక్సెస్ కొట్టిన టాలీవుడ్ హీరోస్ వీళ్ళే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తర్వాత రేడియో జాకీగా మారాడు.అనంతరం అష్టాచెమ్మా సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు.అప్పటి నుంచి అనేక హిట్ సినిమాల్లో నటించాడు.

విజయ్ దేవరకొండ:

ఇతడు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చే క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడు.ఆయన తండ్రి గోవర్థన్‍ సినిమా అవకాశాల కోసం మహబూబ్‍నగర్‍ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.టీవీ డైరెక్టర్‍ అయ్యాడు.

తన తండ్రిలాగే సినిమాలపై ఇష్టం పెంచుకున్నాడు.మొదట్లో పలు డ్రామాల్లో నటించాడు.

ఆ తర్వాత నువ్విలా, లైఫ్ ఈజ్‍ బ్యూటీఫుల్ సినిమాల్లో నటించాడు.ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు, అర్జున్‍ రెడ్డి సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు.

ఎల్వీ ప్రసాద్:

సినిమా అవకాశాల కోసం 100 రూపాయలతో ముంబై వెళ్లాడు.అక్కడ ఓ సినిమా కంపెనీలో చేరాడు.కొద్ది రోజులు సినిమాల్లో నటించాక.కమర్ అల్ జమన్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు.ఆ తర్వాత మంచి అవకాశాలతో అంచెలంచెలుగా ఎదిగాడు.

చిరంజీవి:

ఇండస్ట్రీలో ఎవరి సహాయం లేకుండా అడుగుపెట్టి మెగాస్టార్‍గా ఎదిగాడు చిరంజీవి. పునాది రాళ్లు సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన ఖైదీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత స్టార్ హీరో అయ్యాడు.

శ్రీహరి:

హైదరాబాద్ బాలానగర్‍లో పుట్టిపెరిగాడు శ్రీహరి.మొదట్లో ఈయన స్టంట్ మెన్.ఎస్‍ఐ జాబ్ వచ్చినా వదిలిపెట్టాడు.మొదట్లో విలన్‍గా చేసిన ఆయన.తర్వాత హీరోగా ఎదిగాడు.

ఆర్‍ నారాయణ మూర్తి:

విప్లవ భావాల దర్శక నటుడు నారాయణమూర్తి.ఈయన తండ్రి రైతు.అందువల్లే ఆ సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టారు.దాసరి నారాయణ రావు సినిమాల్లో నటించాడు.అర్థరాత్రి స్వాతంత్ర్యం సినిమాను తెరకెక్కించి సక్సెస్‍ అయ్యాడు.

ఏఎన్నార్:

చిన్నతనంలో ఆయన కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉండేది.అందువల్లే పెద్దగా చదువుకోలేదు.స్టేజి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ధర్మపత్ని అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశాడు.ఆ తర్వాత హీరోగా మారి సక్సెస్‍ అయ్యాడు.

రవితేజ:

అమితాబ్‌ను చూసి తానూ హీరో కావాలనుకున్నాడు రవితేజ.మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆయన తర్వాత సైడ్ హీరోగా చేశాడు.అనంతరం ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం, ఇడియ‌ట్‌, ఔను, వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు, అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి లాంటి వ‌రుస హిట్ సినిమాల్లో నటించి సూపర్ స్టార్ అయ్యాడు.

మోహ‌న్ బాబు:

మొదట్లో కాలేజీలో ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‍ స్ట్రక్టర్‍గా పనిచేశాడు.ఆ ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వచ్చాడు.పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు.మొద‌ట్లో విల‌న్ గా న‌టించి.హీరో క్యారెక్ట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ఆదరణ పొందాడు.

#TollywoodHero #TollywoodHero #TollywoodHero #Nani #TollywoodHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు