వరస పెట్టి హిట్లు సాధిస్తున్న తెలుగు హీరోలు ..ఒక్కొక్కరి ఖాతాలో ఎన్ని ఉన్నాయో తెలుసా..?

ఒక సినిమా విడుద‌ల కావాలంటే.దాని వెనుక చాలా క‌ష్టం ఉంటుంది.

 Tollywood Heros Who Are Getting Continuous Hits-TeluguStop.com

క‌థ వినాలి, ఎగ్జిక్యుట్ చేయాలి.సినిమా అనుకున్న‌ది అనుకున్న‌ట్లు రావాలి.

ఫిక్స్ చేసిన టైంకి విడుద‌ల కావాలి.ఒక‌టేమిటి స‌వాల‌క్ష ఇబ్బందులుంటాయి.

 Tollywood Heros Who Are Getting Continuous Hits-వరస పెట్టి హిట్లు సాధిస్తున్న తెలుగు హీరోలు ..ఒక్కొక్కరి ఖాతాలో ఎన్ని ఉన్నాయో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో ఏ ఒక్క‌టి అటు ఇటు అయినా సినిమా రిజ‌ల్ట్ మారిపోవ‌చ్చు.ఒక్క సినిమాకే ఇలా ఇబ్బందులు ప‌డితే.

ఇండ‌స్ట్రీలో వ‌రుస హిట్లు కొట్టాలంటే అంత ఆశామాషీ వ్య‌వ‌హారం కాదు.అయినా ఈ ఇబ్బందుల‌న్నీ త‌ట్టుకుని అద్భుత చిత్రాల్లో న‌టించిన హీరోలు ఉన్నారు.

ఇండ‌స్ట్రీ హిట్లు సాధించారు.ప్ర‌స్తుత హీరోల్లో.

ఎవ‌రు వ‌రుస‌ విజ‌యాలు సాధించారో ఇప్పుడు చూద్దాం.

ప‌వ‌న్ క‌ల్యాణ్- 6 వ‌రుస‌ సూప‌ర్ హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

1997లో వ‌చ్చిన గోకులంలో సీత‌, 1998లో వ‌చ్చిన సుస్వాగ‌తం, 1998లో వ‌చ్చిన మ‌రో మూవీ తొలి ప్రేమ‌, 1999లో వ‌చ్చిన త‌మ్ముడు, 2000లో విడుద‌ల అయిన బ‌ద్రి, 2001 వ‌చ్చిన ఖుషి సినిమాలు వ‌రుసగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించాయి.

మ‌హేష్ బాబు- 3 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌రుస‌గా 3 హిట్లు కొట్టాడు.2011లో దూకుడు, 2012లో బిజినెస్ మ్యాన్, 2013లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుతో వ‌రుస విజ‌యాలు సాధించాడు.అటు 2018లో భ‌ర‌త్ అనే నేను, 2019లో మ‌హ‌ర్షి, 2020లో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలు సైతం వ‌రుస‌గా విజ‌యం సాధించాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్- 5 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2015లో విడుద‌ల అయిన టెంప‌ర్, 2016లో వ‌చ్చిన నాన్న‌కు ప్రేమ‌తో, 2016లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్, 2017లో విడుద‌ల అయిన జై ల‌వ‌కుశ‌, 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత సినిమాలు వ‌రుస‌గా సూప‌ర్ స‌క్సెస్ సాధించాయి.

అల్లు అర్జున్- 3 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2003లో వ‌చ్చిన గంగోత్రి, 2004లో వ‌చ్చిన ఆర్య‌, 2005లో వ‌చ్చిన బ‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించాయి.అటు 2014లో రేసుగుర్రం, 2015లో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, 2016లో స‌రైనోడు హిట్ కొట్టాయి.

ప్ర‌భాస్- 3 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2013లో వ‌చ్చిన మిర్చి, 2015లో వ‌చ్చిన బాహుబ‌లి1, 2017లో వ‌చ్చిన బాహుబ‌లి2 ఇండ‌స్ట్రీ హిట్లు సాధించాయి.

రాంచ‌ర‌ణ్-2 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ హీరోగా చేసి 2016లో వ‌చ్చిన ధృవ‌, 2018లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలు మంచి హిట్ అయ్యాయి.

ర‌వితేజ‌-3 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2001లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, 2002లో ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు, 2002లో ఇడియ‌ట్ చిత్రాలు విడుద‌లై వ‌రుస విజ‌యాలు సాధించాయి.

నాని- 6 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2015లో వ‌చ్చిన భ‌లెభ‌లే మ‌గాడివోయ్, 2016లో వ‌చ్చిన కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, 2016లో వ‌చ్చిన జెంటిల్మ‌న్, 2016లో వ‌చ్చిన మ‌జ్ను, 2017లో వ‌చ్చిన నేను లోక‌ల్, 2017లో వ‌చ్చిన నిన్నుకోరి సినిమాలు వ‌రుస హిట్లు కొట్టాయి.

అల్ల‌రి న‌రేష్- 3 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2010లో వ‌చ్చిన క‌త్తి కాంతారావు, 2011లో వ‌చ్చిన ఆహా నాపెళ్లంట‌, 2011లో వ‌చ్చిన సీమ ట‌పాకాయ్ సినిమాలు వ‌రుస‌గా విజ‌యం సాధించాయి.

రానా- 3 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2012లో వ‌చ్చిన కృష్ణం వందే జ‌గ‌ద్గురుం, 2017లో వ‌చ్చిన ఘాజీ, 2017లో విడుద‌ల అయిన నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలు వ‌రుస విజ‌యం సాధించాయి.

శ‌ర్వానంద్- 2 వ‌రుస హిట్లు

Telugu Tollywood Heros Hits-Telugu Stop Exclusive Top Stories

2014లో విడుద‌ల అయిన ర‌న్ రాజా ర‌న్, 2015లో వ‌చ్చిన మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజుతో పాటు.2016లో వ‌చ్చిన ఎక్స్ ప్రెస్ రాజా, 2017లో వ‌చ్చిన శ‌త‌మానంభ‌వ‌తి సినిమాలు హిట్ అయ్యాయి.

#TollywoodHeros

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు