రాజమౌళి సహకారం లేకుండానే ఆ గుర్తింపు తెచ్చుకుంటామంటున్న టాలీవుడ్ యంగ్ హీరోస్..

Tollywood Heros Top Position Without Rajamouli Help

రాజమౌళి. ఇండియన్ సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు.

 Tollywood Heros Top Position Without Rajamouli Help-TeluguStop.com

ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా కూడా అపజయం అనే మాటను వినలే.బాహుబలి తర్వాత ఆయన ప్రతిభ మరోస్థాయికి చేరింది.

ఈ సినిమాతో ప్రపంచ స్థాయి దర్శకుడిగా మారాడు.ఈ సినిమాలో నటించిన ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు.

 Tollywood Heros Top Position Without Rajamouli Help-రాజమౌళి సహకారం లేకుండానే ఆ గుర్తింపు తెచ్చుకుంటామంటున్న టాలీవుడ్ యంగ్ హీరోస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అటు రాజమౌళితో సినిమాలు చేస్తే దేశ వ్యాప్త గుర్తింపు దక్కడం ఖాయం అనుకుంటున్నారు కొందరు హీరోలు.ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్న రాం చరణ్, ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియా హీరోలుగా మారే అవకాశం కనిపిస్తోంది.

వీరిద్దరు కలిసి త్రిఫుల్ ఆర్ సినిమా చేస్తున్నారు.

కొందరు హీరోలు మాత్రం రాజమౌళి సహకారం లేకుండానే పాన్ ఇండియన్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతకీ వారు ఎవరో కాదు.అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది.

పలు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా కూడా పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Telugu Allu Arjun, Bahubali, Rajamouli, Liger, Pan Indai Range, Prabhas, Pushpa, Ram Charan, Tollywood Heros, Tollywoodpan-Movie

నిజానికి టాలీవుడ్ కు చెందిన అల్లు అర్జున్ కు సౌత్ లో మంచి మార్కెట్ ఉంది.కేరళలో ఆయన సినిమా రిలీజ్ అయితే.అక్కడి సినిమాలు వాయిదా పడుతాయి.పుష్ప సినిమాతో అతడి మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.అక్కడే కాదు.తమిళం, కన్నడ సహా హిందీలోనూ ఈ సారి మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందంటున్నారు.

ఈ దెబ్బతో ఆయన పాన్ ఇండియా హీరో అవుతాడనే టాక్ నడుస్తుంది.

Telugu Allu Arjun, Bahubali, Rajamouli, Liger, Pan Indai Range, Prabhas, Pushpa, Ram Charan, Tollywood Heros, Tollywoodpan-Movie

అటు అర్జున్ రెడ్డితో దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.ప్రస్తుతం లైగర్ తో పాన్ ఇండియా రేంజిలో ముందుకు పోతున్నాడు.కరణ్ జోహార్ సహకారం, అనన్య పాండే హీరోయిన్ కావడం, మైక్ టైసన్ లాంటి ఇంటర్నేషన్ స్టార్ ఇందులో నటించడం.

సహా పలు ఆయనకు పాన్ ఇండియన్ హీరో గుర్తింపు తేవడం ఖాయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

#Indai Range #Liger #Pushpa #Rajamouli #TollywoodIndia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube