తెలుగు నటులు అప్పుడప్పుడు తమలోని మరికొన్ని కళలను బయట పెడుతుంటారు.వాటితో అనుకున్న దానికంటే ఎక్కువగా పాపులర్ అవుతారు.
నాటి ఎన్టీఆర్ నుంచి నేటి మంచు మనోజ్ దాకా ఈ ట్రెండ్ కొనసాగుతోంది.ఇంతకీ వీళ్లు చేసింది ఏంటంటే వాళ్ల సినిమాల్లో వాళ్లే పాటలు పాడుకోవడం.
ఈ పాటలు వారి సినిమాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టాయి.ఇంతకీ మన తెలుగు నటులు పాడిన పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం!
బాలకృష్ణ:
యువరత్నగా పేరొందిన నందమూరి బాలకృష్ణ తన సినిమాలో ఓ పాట పాడి నెట్టింట్లో హల్ చల్ చేశాడు.పైసా వసూల్ సినిమా లో మామా ఏక్ పెగ్ లా పాట పాడి అదరగొట్టాడు.ఈ పాట మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
వెంకటేష్:
వెంకటేష్ కూడా తన సినిమా గురులో ఓ పాట పాడాడు.తనలోని సింగింగ్ చూపించుకున్నాడు.ఈ చిత్రంలో కోచ్ గా పనిచేసిన ఆయన జింగిడడి జింగిడి అనే పాటకు గాత్రం ఇచ్చాడు.
నాగార్జున:
నటుడు నాగార్జున సైతం తనలోని పాడు గుణానికి పని చెప్పాడు.శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ మూవీలో కొత్తకొత్త భాష అనే పాట పాడాడు.
జూ.ఎన్టీయార్:
తెలుగులో అందరు హీరోల కంటే ఎక్కువ పాటలు పాడాడు జూనియర్ ఎన్టీఆర్.కంత్రీ సినిమాతో మొదలలైన తన పాటల ప్రయాణం అదుర్స్ వరకు కొనసాగింది.123 నేనొక కంత్రి అంటూ కంత్రి మూవీలో దుమ్మురేపాడు.యమదొంగలో ఓలమ్మో, రభసలో రాకాసి రాకాసి, నాన్నకు ప్రేమతో లో ఫాలో ఫాలో ఫాలో, అదుర్స్ సినిమాలో చారీ అనే పాటలు పాడి వారెవ్వా అనిపించాడు.
పవన్ కళ్యాణ్:
పంజాతో మొదలైన తన పాటల ప్రయాణం అత్తారింటికి దారేది సినిమా వరకు కొనసాగించాడు పవన్ కల్యాణ్.పంజా సినిమాలో పాపారాయుడు పాటలో కొన్ని లైన్స్ పాడిన ఆయన.అత్తారింటికి దారేది కాటమరాయుడా కదిరి నరసింహుడా అనే పేరడి సాంగ్ పాడాడు.
రవితేజ:
మాస్ హీరో రవితేజ కూడా పాటలు పాడాడు.పవర్ సినిమాలో నోటంకి నోటంకి అనే పాట పాడాడు.తన పవర్ తో జనాల్లో జోష్ నింపాడు.ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంది.
చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి సైతం రెండు పాటలు పాడాడు.మాస్టార్ సినిమాలో తమ్ముడు అరె తమ్ముడు అంటూ పాడిన చిరు.మృగరాజు సినిమాలో ఛాయ్ చటుక్కున తాగరా భాయ్ అంటూ అదరగొట్టాడు.
మనోజ్:
మంచు వారి చిన్నబ్బాయి కూడా పాటలు పాడాడు.పోటుగాడు సినిమాలో ప్యార్ మే పడిపోయానే అని పాడిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.
సిద్దార్ద్:
పలు సినీ ఇండస్ట్రీల్లో పలు సినిమాలు చేసే సిద్ధార్ పలు పాటలు పాడాడు.ఇప్పటి వరకు పది సినిమాలల్లో పాటలు పాడాడు.వాటిల్లో బొమ్మరిల్లు సినిమాలో పాడిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే పాట బాగా పేరు తెచ్చింది.
నితిన్:
నితిన్ కూడా ఓ పాటపాడి వారెవ్వా అనిపించాడు.ఇష్క్ సినిమాలో కోడివాయే లచ్చమ్మది పాటతో దుమ్మురేపాడు.
విజయ్ దేవరకొండ:
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం ఓ పాట పాడాడు.గీతగోవిందం సినిమాలో అమెరిక గర్ల్ అయినా అనే పాట పాడాడు.