అనుకున్న సినిమాతో కాకుండా మరొక సినిమాతో వారసులను పరిచయం చేసిన హీరోస్

సినిమా తార‌లు త‌మ పిల్ల‌ల‌ను ఇండ‌స్ట్రీలోకి తీసుకురావాలి అనుకుంటే ప‌క‌డ్బందీగా నిర్ణ‌యం తీసుకుంటారు.తొలి సినిమా విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు పాటిస్తారు.

 Tollywood Heros Sons Movies Unknown Facts-TeluguStop.com

తొలి సినిమా వారి కెరీర్ పై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంది.కాబ‌ట్టి తొలి మూవీ క‌థ‌, క‌థ‌నంతో పాటు డైరెక్ట‌ర్ విష‌యంలోనూ కేర్ తీసుకుంటారు.

కొంద‌రు న‌టులు మాత్రం త‌మ పిల్ల‌ల విష‌యంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు పక్క‌న పెట్టి.చివ‌రి విష‌యంలో మ‌రో సినిమాతో ముందుకు వ‌చ్చారు.ఇంత‌కీ ఆ సినిమాలు ఏంటి? చివరికి ఎందుకు మ‌న‌సు మార్చుకున్నారో ఇ‌ప్పుడు చూద్దాం!

 Tollywood Heros Sons Movies Unknown Facts-అనుకున్న సినిమాతో కాకుండా మరొక సినిమాతో వారసులను పరిచయం చేసిన హీరోస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాం చ‌ర‌ణ్:

మెగాస్టార్ త‌న కొడుకు రాంచ‌ర‌ణ్ తొలి సినిమా రాజ‌మౌళితో తీయాలి అనుకున్నాడు.స్టోరీ కూడా రెడీ అయ్యింది.కానీ చివ‌రి నిమిషంలో చిరు మ‌న‌సు మార్చుకున్నాడు.రాజ‌మౌళి కంటే పూరీ జ‌గ‌న్నాథ్ బెస్ట్ అనుకున్నాడు.రాంచ‌ర‌ణ్ తొలి ప్రాజెక్టు పూరీ చేతిలో పెట్టాడు.చిరుత అనే పేరుతో తీసిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.అల్లు అర్జున్:

అల్లు అర్జున్ ను తేజ త‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కె‌క్కించిన జ‌‌యం మూవీతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాలి అనుకున్నాడు.అల్లు అర‌వింద్ కూడా ఓకే చెప్పాడు.ప‌బ్లిక్ గా ప్ర‌క‌ట‌న కూడా చేశారు.అనుకోని కార‌ణాల‌తో తేజ నితిన్ తో ఈ సినిమా చేశాడు.ఆ త‌ర్వాత గంగోత్రి సినిమాతో రాఘ‌వేంద్ర రావు అల్లు అర్జున్ ను ప‌రిచ‌యం చేశాడు.ఈసినిమా హిట్ సాధించింది.నాగ చైత‌న్య‌:

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కొడుకును ప‌రిచ‌యం చేయాలి అనుకున్నాడు నాగార్జున‌.పూరీ త‌న కోసం ఓ స్టోరీ కూడా సిద్ధం చేసుకున్నాడు.ఈ స్టోరీ విన్న నాగార్జున ఓకే చెప్పాడ‌ట‌.ఈ క‌థ‌లో నాగార్జున కొన్ని మార్పులు చెప్పాడ‌ట‌.దానికి పూరీ ఒప్పుకోక పోవ‌డంతో ప్రాజెక్టు నిలిచిపోయింది.అనంత‌రం వాసు వ‌ర్మ జోష్ మూవీతో నాగ చైత‌న్య ప‌రిచ‌యం అయ్యాడు.

కానీ ఈసినిమా ఫ్లాప్ అయ్యింది.అఖిల్:

మ‌నం మూవీతో మంచి విజ‌యం అందించిన విక్ర‌మ్ కే కుమార్ డైరెక్ట‌ర్ గా త‌న చిన్న కొడుకు అఖిల్ ను ప‌రిచ‌యం చేయాలి అనుకున్నాడు.కానీ త‌న నిర్ణ‌యం మార్చుకున్నాడు.మాస్ డైరెక్ట‌ర్ వీవీవినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అనే సినిమా చేయించాడు.

ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.రామ్:

ప్రొడ్యూస‌ర్ స్ర‌వంతి ర‌వి కిశోర్ యువ‌సేన సినిమా తెలుగు హ‌క్కులు త‌న త‌మ్ముడి కొడుకు రామ్ కోసం తీసుకున్నాడు.వైవీఎస్ చౌదరి డైరెక్ట‌ర్ గా దేవ‌దాసు అనే సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు.ఈ సినిమాతో రామ్ సూప‌ర్ హిట్ కొట్టాడు.వ‌రుణ్ తేజ్:

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ ను ప‌రిచ‌యం చేయాల‌ని నాగ‌బాబు అనుకున్నాడు.‌స్టోరీ రెడీ అయ్యింది.ఈ క‌థ విన్న చిరంజీవి.వ‌ద్ద‌ని స‌లహా ఇచ్చాడు.దీంతో శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో ముకుందా సినిమ చేసి ప‌రాజ‌యం పొందాడు.

#Devadas #Heroes Sons #TollywoodHeroes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు