వరసగా ప్రమాదాల బారిన పడుతున్న స్టార్ హీరోలు

Tollywood Heros Series Of Accidents Ntr Balayya Prabhas Mahesh Babu

సినిమా స్టార్స్ అనగానే లగ్జరీ లైఫ్ కనిపిస్తుంది.కానీ దాని వెనుక వారు పడుతున్న ఇబ్బందులు ఎన్నో ఉంటాయి.

 Tollywood Heros Series Of Accidents Ntr Balayya Prabhas Mahesh Babu-TeluguStop.com

డబ్బులు వస్తాయి అనే మాట వాస్తవమే అయినా.ఆ డబ్బుకోసం వారు పడే కష్టం మామూలుగా ఉండదు.

రాత్రి, పగలు అని తేడా లేకుండా.తిండి, నిద్ర లేకుండా సినిమాల కోసం పడే కష్టం వర్ణనాతీతం.

 Tollywood Heros Series Of Accidents Ntr Balayya Prabhas Mahesh Babu-వరసగా ప్రమాదాల బారిన పడుతున్న స్టార్ హీరోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా షూటింగ్ లో భాగంగా కుటుంబానికి దూరంగా రోజుల తరబడి గడపాల్సి ఉంటుంది.అంతేకాదు.

ఆయా సినిమాల్లో పాత్రలకు సరిపోయేలా శరీర బరువు తగ్గడమో.పెరగడమో చేయక తప్పదు.

ఇందుకోసం గంటల తరబడి జిమ్ లో గడపాల్సి ఉంటుంది.అంతేకాదు.

నోరు కట్టుకుని తిండి తినాల్సి ఉంటుంది.ఇంతచేసి.

ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే అడ్రస్ గల్లంతు కావడం ఖాయం.

ఆయా సినిమాల్లో ఫైట్స్ చేసేటప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కలర్ ఫుల్ లైఫ్ వెనుక ఎన్నో అవస్థలు ఉంటాయి.అందుకే సినిమా తారలు బయటకు కనిపించేంత సుఖంగా తెర వెనుక ఉండలేరు.

అటు విదేశీ ప్రయాణాల మూలంగా శరీరం ఆయా వాతావరణ పరిస్థితులను తట్టుకోలేకపోతుంది.అందుకే పలువురు సినిమా తారలు తరుచూ ఆస్పత్రిలో చేరుతుంటారు.

ఆయా ఇబ్బందులతో చికిత్స తీసుకుంటారు.ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ పలు సర్జరీలు చేసుకున్నారు కూడా.

ఓసారి షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడు.కుడిచేతి వేళ్లకు దెబ్బలు తగిలాయి.డాక్టర్స్ ఆయన చేతికి సర్జరీ చేశారు.అటు నందమూరి బాలయ్యకు కూడా ఓ సారి ఎడమ చేతికి శస్త్రచికిత్స జరిగింది.సూపర్ స్టార్ మహేష్ బాబు కుడి కాలుకు సర్జరీ అయ్యింది.మహేష్ బాబు కొన్నాళ్లు మోకాలి నొప్పితో బాధపడ్డాడు.

ఒకానొక సమయంలో నడిచేందుకే కష్టంగా ఉండేది.

దీని నుంచి బయట పడేందుకు మహేష్ బాబు సర్జరీ చేయించుకున్నాడు.తాజాగా మరో స్టార్ ప్రభాస్ కూడా సర్జరీకి రెడీ అవుతున్నాడు.ఆయన చేతికి గాయం అయ్యింది.

దాని మూలంగా కొంత కాలంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు.త్వరలో అమెరికాకు వెళ్లి ఈ సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.

Tollywood Heroes Accidents Mahesh Babu Knee Surgery

#Accidnets #Mahesh Babu #Jr NTR #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube