Tollywood Heros: సరైన డైరెక్టర్ వచ్చేవరకు గ్యాప్ తీసుకుంటున్న మన సూపర్ స్టార్ హీరోలు..!

సాధారణంగా హీరోలకి వరస పెట్టి సినిమాలు లైనప్ అవుతూ ఉంటాయి.అందుకే ఒక సినిమా అయిపోయి మరో సినిమా పట్టాలెక్కెంత వరకు దర్శకులు తమ నంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

 Tollywood Heros Maintain Silence For Directors Chiranjeevi Mahesh Babu Yash-TeluguStop.com

ఇది చాలా ఏళ్లుగా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు అన్ని వుడ్స్ లలో కూడా జరుగుతున్న రెగ్యులర్ ప్రక్రియ.కానీ ఈసారి ఈ ప్రక్రియకు భిన్నంగా హీరోలు తమకు హిట్ ఇచ్చే దర్శకులు వచ్చేవరకు వెయిట్ చేస్తున్నారు.మరి హిట్ ఇచ్చే దర్శకుల కోసం వెయిట్ చేస్తున్న ఆ హీరోలు ఎవరు? ఆ కాంబినేషన్స్ ఏంటి ? అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చిరంజీవి

2023వ సంవత్సరంలో చిరంజీవి( Chiranjeevi ) వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ కొట్టేసి అందరికీ మాస్ ట్రీట్ ఇచ్చేసాడు.మాస్ సినిమా అంటే తనకు కొట్టిన పిండి అని మరోసారి నిరూపించుకున్నాడు.అయితే ఆ తర్వాత భోళా శంకర్ తో భారీ డిజాస్టర్ అందుకున్న తర్వాత కాస్త మౌనం పాటిస్తున్నాడు చిరంజీవి.

తనకు బింబిసార డైరెక్టర్ వశిష్ట( Director Vasishta ) లైన్లోకి వచ్చేంత వరకు కూడా మరొక సినిమా చేయడానికి ఒప్పుకోకుండా గ్యాప్ తీసుకుని మరి తన సినిమాని స్టార్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ జరుగుతుంది.

Telugu Rajamouli, Vasishta, Directors, Yash, Mahesh Babu, Chiranjeevi, Prashanth

మహేష్ బాబు

ఈ సంక్రాంతికి మహేష్ బాబు( Mahesh Babu ) గుంటూరు కారం( Guntur Karam ) సినిమాతో త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా రావడానికి రంగం సిద్ధం అయిపోయింది.ఈ సినిమా జయాపజయలతో సంబంధం లేకుండా మరో సినిమాకి ఓకే చెప్పలేకపోతున్నాడు.మహేష్ బాబు అందుకు గల కారణం రాజమౌళితో ఒక సినిమా కమిట్ కావడమే అని తెలుస్తోంది.కానీ రాజమౌళి తన తదుపరి సినిమా ఎప్పుడు తీస్తాడో అతడికి క్లారిటీ లేదు.

ఇంతవరకు కథ కూడా సిద్ధం కాలేదు అయినా కూడా రాజమౌళి( Rajamouli ) అన్ని సిద్ధం చేసుకునేంతవరకు ఓపిగ్గా వెయిట్ చేయడానికి మహేష్ బాబు సిద్ధమైపోయాడు.దాంతో గుంటూరు కారం సినిమా తర్వాత మరొక సినిమా పట్టాలు ఎక్కడానికి ఎప్పుడు సిద్ధమవుతుందో మహేష్ కి కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

Telugu Rajamouli, Vasishta, Directors, Yash, Mahesh Babu, Chiranjeevi, Prashanth

యష్

కే జి ఎఫ్( KGF ) సినిమాలతో హిట్ అందుకొని ప్రస్తుతం ఏ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తాడో తెలియకుండా పోయింది రాఖీ బాయ్ పరిస్థితి.ఓవైపు మరొక కేజీఎఫ్ సినిమానే వస్తుంది అని అభిమానులంతా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు.సలార్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ రాఖీ బాయ్ కోసం కథ సిద్ధం చేసే ఖాళీ కూడా లేదు.మరి రాఖీ బాయ్ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అనే క్లారిటీ లేకుండానే ప్రస్తుతం మౌనంగా ఉంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube