ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేసిన నిర్మాతలు ఎవరో తెలుసా?

వారసత్వం అనేది ప్రతీరంగంలో కొనసాగుతూనే ఉంది.నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతుంది.

 Tollywood Heros Introduced By These Producers-TeluguStop.com

ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది.ప్రస్తుతం సినిమా రంగం కూడా వారసత్వంతో నిండిపోయింది.

ఒక్కరు సినిమా రంగంలోకి వచ్చి క్లిక్ అయితే చాలు.ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చి చేరుతున్నారు.

 Tollywood Heros Introduced By These Producers-ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేసిన నిర్మాతలు ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతల వారసులు తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టారు.అయితే చాలా మంది నట వారసులను పలువురు నిర్మాతలు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.

పవన్ కల్యాణ్

అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కల్యాణ్ పరిచయం అయ్యారు.ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మహేశ్

1999లో రాజకుమారుడు సినిమాతో కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్లో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు.

జూ.ఎన్టీఆర్

హరికృష్ణ నటవారసుడిగా 2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో రామోజీరావు నిర్మాతగా నిన్ను చూడాలని సినిమాతో పరిచయం అయ్యాడు.ఈ ససినిమాకు వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు.

ప్రభాస్

2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ పరిచయం అయ్యాడు.నటుడు అశోక్ కుమార్ నిర్మాతగా డైరక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

అల్లు అర్జున్

2003లలో గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ పై అశ్వనీదత్, అల్లు అరవింద్ కలిసి ఈ సినిమా నిర్మించారు.

రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 2009లో చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మాతగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.

నాగచైతన్య-అఖిల్

నాగ చైతన్య జోష సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఈ సినిమాకు ను దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా వాసు దర్శకత్వం వహించారు.అఖిల్ ను హీరో నితిన్ నిర్మాతగా వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

#Ram Charan #Allu Arjun #Prabhas #Jr NTR #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు