పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి డిజాస్టర్ అయిన టాప్ హీరోలు ఎవరో తెలుసా?

Tollywood Heros Flop Career In Politics

ఒక పని మొదలు పెట్టడం కాదు.ఆ పనిని పూర్తి చేసినప్పుడే దానికి నిజమైన ప్రతిఫలం ఉంటుంది.

 Tollywood Heros Flop Career In Politics-TeluguStop.com

అలా కాదని మొదలు పెట్టి మధ్యలోనే వదిలేస్తే.ఫలితం శూన్యం.

అలాగే సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది నటులు రాజకీయ పార్టీలను స్థాపించారు.కొందరు సక్సెస్ అయితే మరికొంత మంది ఫ్లాప్ అయ్యారు.

 Tollywood Heros Flop Career In Politics-పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి డిజాస్టర్ అయిన టాప్ హీరోలు ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి సంచలనం కలిగించాడు.పార్టీ పెట్టి కేవీలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు.

తెలుగు జనాల మదిలో అంతగా స్థానం సంపాదించుకున్నాడు కాబట్టే ఈ విజయం సాధ్యం అయ్యింది.

అటు తమిళంలో సైతం పలువురు సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన విషయం తెలిసిందే .ఎన్టీఆర్ తో సమానంగా అక్కడ గుర్తింపు తెచ్చుకున్న ఎంజీ రామచంద్రన్ కూడా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు.తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశాడు.జయలలిత సైతం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చింది.13 ఏండ్ల పాటు తమిళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసింది.

అయితే కొందరు సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి ఘోరంగా విఫలం అయ్యారు.

Telugu Chiranjeevi, Heroes, Janasena, Jayalalitha, Kamal Hasan, Karthik, Pawan Kalyan, Prajarajyam, Tollywood, Vijay, Vijay Kanth-Movie

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించాడు.అయితే పార్టీని నడపడంలో ఘోరంగా విఫలం అయ్యాడు.కేవలం 18 స్థానాలను మాత్రమే గెల్చుకున్నాడు.ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ సైతం రాజకీయాల్లోకి ఏదో ఉన్నానంటే ఉన్నా అన్నట్లు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు.2014లో ఆయన జనసేన పార్టీని స్థాపించినా జనాల్లో గుర్తింపు పొందలేదు.

Telugu Chiranjeevi, Heroes, Janasena, Jayalalitha, Kamal Hasan, Karthik, Pawan Kalyan, Prajarajyam, Tollywood, Vijay, Vijay Kanth-Movie

అటు ఈయనతో పాటు తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూడా ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు.అయితే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయాడు.అటు విజయ్ కాంత్, కార్తీక్, విజయ్ సహా పలువురు నటుడు రాజకీయాల్లోకి వచ్చారు.కానీ ఘోరంగా విఫలం అయ్యారు.పార్టీని మూసేసి మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టారు.సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

#Vijay Kanth #Karthik #Jayalalitha #Prajarajyam #Vijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube