ఆ హీరోల కడుపున పుట్టడమే మేము చేసుకున్న పెద్ద శాపం అంటున్న వారసురాళ్లు.!!  

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడా బడా హీరోల ఫ్యామిలీస్ నుండి వచ్చిన ఎంతోమంది హీరోలు సక్సెస్ అయి ఇప్పుడు స్టార్లుగా ఎదిగిన సంగతి మనందరికి తెలిసిందే.అయితే ఆ టాప్ హీరోల కొడుకులు ఎంతోమంది స్టార్స్ అయ్యారు గాని వాళ్ళ కూతుర్లు మాత్రం అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయారు.

TeluguStop.com - Tollywood Heros Family Members Hidden Problems

దీనికి కారణం వాళ్ళ అభిమాని హీరో కూతురు వేరే హీరోలతో డాన్సులు చేయడం, సినిమాలు చేయడం ఫ్యాన్స్ కి నచ్చట్లేదట.అందుకే స్టార్ హీరో కూతుర్ల సినీ ప్రయాణం అంత కూడా మద్యలోనే ఆగిపోయింది.అయితే అలా మధ్యలోనే కెరియర్ ఆగిపోయిన స్టార్స్ కూతుర్లు ఎవరో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం…

ఈ లిస్ట్ లో ముందుగా యూనివర్సల్ హీరో అయిన కమల్ హాసన్ కూతుర్లు గురించి మాట్లాడుకోవాలి.ఈయనకు ఇద్దరు ముద్దుల కూతుర్లు ఉన్నారు.వీరిలో ఇప్పటికే హీరోయిన్‌గా సత్తా చాటుతున్న శృతి హాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో ప్లాప్ సినిమాలను ఉన్నాయి.ఇక కమల్ హాసన్ రెండొవ కూతురు అక్షరా హాసన్ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా అవి ఆమెకి పెద్దగా పెరు తెచ్చిపెట్టలేదు.

TeluguStop.com - ఆ హీరోల కడుపున పుట్టడమే మేము చేసుకున్న పెద్ద శాపం అంటున్న వారసురాళ్లు.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక మెగా‌ ప్యామిలీ నుంచి డజనుకు పైగానే హీరోలు ఉన్నారు.వాలందరిని కూడా ప్రేక్షకులు ఆదరించారు.అయితే చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తయిన నిహారికను మాత్రం ప్రేక్షకులు హీరోయిన్ గా ఆదరించలేదనే చెప్పాలి.నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కూడా ఆమెని ప్రేక్షకులు హీరోయిన్ లా యాక్సప్ట్ చేయలేకపోయారు.

ఇక ఈ లిస్ట్ లో వెండితెరపై హీరోయిన్స్‌గా లక్ పరీక్షించుకుంటున్న హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక లను కూడా ప్రేక్షకులు హీరో రాజశేఖర్, జీవిత కూతుర్లుగానే చూస్తూ వీళ్ళని ఆదరించలేకపోతున్నారు.కానీ వేళ్ళ ప్రయత్నాలు వేళ్ళు చేస్తూ సినిమాలు చేయడం మాత్రం ఆపడం లేదు.

ఇక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా నటించక పోయినా.నటిగా మాత్రం మంచి సత్తా చాటుతోంది.కానీ ఎందుకో పూర్తి స్థాయిలో నటిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు.

ఇక అక్కినేని నాగేశ్వరావు గారి మనమరాలు నాగార్జున మేనకోడలైన సుప్రియ యార్లగడ్డ.మొదటి పవన్ కళ్యాణ్ తో కలిసి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది.అయితే ఈ సినిమా తర్వాత ఈమెకి అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు మంచి మంచి సినిమాల్లో అదిరిపోయే పాత్రలలో నటిస్తుంది.

ఇక సూపర్ స్టార్ కృష్ణ రెండో కూతురు, మహేష్ బాబు చిన్నక్క మంజుల కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టాలని ఎన్నో కళలు కన్నది.అప్పట్లో బాలకృష్ణ గారితో ఒక సినిమా ఓకే కూడా అయింది.కానీ కృష్ణగారి అమ్మాయి కాబట్టి ఆమెని వేరేవాళ్ళ పక్కన వూహించుకోలేము అంటూ ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున మౌత్ టాక్ రావడంతో ఆ అవకాశం వెనక్కి వెళ్ళింది.దాంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి.

కానీ మంజుల కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది.

తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్‌గా సత్తా చాటాలని చూసారు.కానీ కొన్ని సినిమాలు ఓకే గాని ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా రాయించలేకపోయింది.ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో విలన్ గా, మంచి మంచి పవర్ఫుల్ రోల్స్ ప్లే చేస్తోంది.

ఇప్పుడు క్రాక్ లో కూడా రవితేజ ని డీ కొట్టడానికి రెడీ అయిపోయింది.

ఇక తమిళంలో ఒకప్పుడు హీరోగా నటించిన విజయ్ కుమార్ కు ముగ్గురు కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు ఉన్నారు వీళ్ళు ముగ్గురు హీరోయిన్స్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.కానీ చాల తక్కువ సినిమాలు మాత్రమే చేసారు.

ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కూతు ఐశ్వర్యా కూడా హీరోయిన్‌గా లక్ పరీక్షించుకుంది.ఈమె విశాల్ హీరోగా నటించిన ధీరుడు అనే సినిమాతో పరిశ్రమలోకి అరంగేంట్రం చేసింది.అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఈమెకి అవకాశాలు రాలేదు.

#ActionKing #Mega Daughter #TollywoodHeroes #TollywoodHeros #Varalaxmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Heros Family Members Hidden Problems Related Telugu News,Photos/Pics,Images..