మీసాలపై ఆధారపడ్డ టాలీవుడ్ హీరోల కెరీర్..ఇందులో నిజమెంత..?

తెలుగు సినిమాల్లో హీరోలు అంటే హైటు వేటు బాగుండి మీసాలు ఉంటేనే ఇక్కడ జనాలు హీరోలుగా గుర్తిస్తారు అలా కాకుండా మీసాలు తీసేసి నటిస్తే తెలుగు అభిమానులు వాళ్లని ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే తెలుగు వారికి ఎప్పుడైనా మీసం ఉంటేనే గర్వంగా ఉంటుందని మనం చాలాకాలం నుంచి వింటూ వస్తున్నాం.మన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్ లో మాత్రం మీసాలు ఉన్న వారిని అక్కడి జనాలు ఎక్కువగా ఆదరించారు అందుకే అక్కడ పెద్ద హీరోలుగా ఉన్న అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి హీరోలకు మీసాలు ఉండవు రన్ వీరు సింగ్ లాంటి వారికి మీసాలు ఉన్నప్పటికీ తనది ఒకరకమైన స్టైల్ గా గుర్తిస్తారు.

 Tollywood Heros Career Depends On Their Mustache ,tollywood Heros , Bollywood  P-TeluguStop.com

తెలుగులో పెద్దహీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు సైతం బాలీవుడ్ లో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోలేక పోయారు ఎందుకంటే బాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలి అంటే సినిమా ఎలా ఉందో విషయం పక్కన పెడితే హీరోల అలంకారం ఎలా ఉంది అన్న దానిపైన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు మీసాలు తీసేసిన యాక్టర్స్ ని వాళ్లు వాళ్ల సొంత మనుషులా ఫీల్ అవుతారు.ఆ కారణం వల్లే తెలుగులో పెద్ద హీరోగా గుర్తింపు పొందిన వారు ఎవరూ కూడా అక్కడ గుర్తింపు సాధించలేకపోయారు.

Telugu Bollywood, Mahesh Babu, Pavan Kalyan, Prabhas, Tollywood Heros-Telugu Sto

అలాగే తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు సాధించలేక పోయాడు రజినీకాంత్ గారికి మీసాలే అందం అవే ఆయన స్టైల్ అది లేకుండా చూడడం అంటే తెలుగు తమిళ ప్రేక్షకులకు కొంచెం కష్టం గానే ఉంటుంది.కమలహాసన్ లాంటి హీరో కొన్ని సినిమాల్లో మీసాలతో నటిస్తాడు కొన్ని సినిమాల్లో మీసాలు లేకుండా కనిపిస్తాడు ఆయన ఏ గెటప్ లో ఉన్న బాగానే సెట్ అవుతుంది కాబట్టి అతన్ని కొన్ని రోజులు అక్కడ ఆడియన్స్ చూడగలిగారు అలాగే సిద్ధార్థ్ కూడా అక్కడ కొన్ని రోజులు తన హవాని కొనసాగించాడు.

Telugu Bollywood, Mahesh Babu, Pavan Kalyan, Prabhas, Tollywood Heros-Telugu Sto

ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మన తెలుగు హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోలు మీసాలు లేకపోతే బాగుండరు అందుకోసమే వాళ్ళు మీసంతోనే నటిస్తూ ఉంటారు.బాహుబలి సినిమా తర్వాత వరల్డ్ వైడ్ గా గుర్తింపు సాధించిన ప్రభాస్ తన తదుపరి సినిమా సాహో సినిమాలో కొన్ని సీన్లలో మీసాలు లేకుండా నటించి మంచి గుర్తింపును సాధించారు మొత్తానికి ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అక్కడ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ,అమీర్ ఖాన్ లకు కూడా లేదు.సాహో సినిమా తెలుగులో కంటే హిందీలో బాగా ఆడింది కలెక్షన్స్ కూడా బాగా రాబట్టగలిగింది ఒక విధంగా ప్రభాస్ కూడా బాలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు పొందాడు అని చెప్పాలి తన తదుపరి చిత్రాలతో కూడా అదేవిధంగా విజయం సాధించగలిగితే బాలీవుడ్ లో ప్రభాస్ నెంబర్ వన్ హీరో అయిపోవడం కాయం.

Telugu Bollywood, Mahesh Babu, Pavan Kalyan, Prabhas, Tollywood Heros-Telugu Sto

మొన్నీమధ్య నాగార్జునుని కూడా మీరు బాలీవుడ్ లో ఎందుకు నటించడం లేదు అని అడిగితే అక్కడ నటిస్తే మీసం తీసేయాల్సి ఉంటుంది అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.మన తెలుగులో అయితే మీసాలని తిప్పుతూ డైలాగులు చెప్పి రౌడీలను కొట్టడమే హీరోయిజం అందుకే మన తెలుగు హీరోలు మీసాలు తీసేసి ఎక్స్పరిమెంట్స్ చేస్తే ఇక్కడ ఉన్న ఆ మాత్రం క్రేజ్ కూడా పోతుంది అని ఆలోచించి బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేయకుండా తెలుగులోనే సక్సెస్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మీసంతో కనిపిస్తారు.

అలాగే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూడా మీసంతో కనిపించబోతున్నాడు.వీళ్ళని బాలీవుడ్ జనాలు ఎలా ఆదరిస్తారో చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube