హీరో యష్ నుంచి మహేష్ బాబు వరకు హీరోల రెమ్యునరేషన్స్ ఇవే !

ఒకప్పుడు కేవలం బాలీవుడ్ హీరోలు మాత్రమే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారు.కానీ ఇటీవలి కాలంలో మాత్రం టాలీవుడ్లో స్టార్ హీరోలు సైతం ఒక్కసారిగా పారితోషికం పెంచేసారూ.

 Tollywood Heros And Their Remunerations Mahesh Babu Yash Ajith Allu Arjun Prabha-TeluguStop.com

దీనికి కారణం కూడా లేకపోలేదు.ప్రస్తుతం సౌత్ హీరోలు నటిస్తున్న సినిమాలూ భారత దేశ వ్యాప్తంగా ఒక రేంజ్ లో హిట్ అవుతున్నాయి.

అందుకే ఇక తమ మార్కెట్ ను బట్టి అటు రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తూ ఉన్నారు.ఇలా ఇటీవలే కే జి ఎఫ్, త్రిబుల్ ఆర్, పుష్ప లాంటి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న హీరోలు అయితే పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటున్నారు అని చెప్పాలి.

ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోలీవుడ్లో ఇళయదళపతి విజయ్ ఒక్కో సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

ఇటీవలే విజయ్ నటించిన బీస్ట్ ఫ్లాప్ అవ్వగా.ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు 118 కోట్లు తీసుకుంటున్నారని టాక్.ఇక మరో స్టార్ హీరో అజిత్ సైతం 105 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక్కో సినిమాకి 64 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మలయాళ ఇండస్ట్రీలోనే ఇదే టాప్ రెమ్యూనరేషన్ కావడం గమనార్హం.

పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఒక్కో సినిమా కోసం దాదాపు 100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.

Telugu Ajith, Yash, Heros, Mahesh Babu, Mohan Lal, Ntrram, Pawan Kalyan, Prabhas

ఇక కే జి ఎఫ్ చాప్టర్ 2 కోసం హీరో యష్ ఏకంగా 35 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకి 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.అందరి హీరోలతో పోలిస్తే ప్రత్యేకమైన క్రేజ్ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి 75 కోట్లు తీసుకుంటున్నారట.

ఇక తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒక్కో సినిమా 50 కోట్లు తీసుకుంటున్నారట.ఇలా సౌత్ లో హీరోలందరూ కూడా భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube