షూటింగ్ కంప్లీట్ అయినా.. విడుదల ఎప్పుడో తెలియని టాప్ హీరోల మూవీస్ ఏంటో తెలుసా?

Tollywood Heros And Their Latest Movie Updates

ఇప్పుడిప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మళ్లీ గాడిన పడుతుంది.ఆయా హీరోలకు సంబంధించిన పలు సినిమాలు విడుదల అవుతున్నాయి.

 Tollywood Heros And Their Latest Movie Updates-TeluguStop.com

మొత్తంగా ఇండస్ట్రీలో మళ్లీ హడావిడి మొదలయ్యింది.ఓ వైపు సినిమాలు మొదలవుతుంటే.

మరోవైపు పలు సినిమాలు విడుదల అవుతున్నాయి.చిన్న, పెద్దా అనే తేడా లేకుడా పలు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి.

 Tollywood Heros And Their Latest Movie Updates-షూటింగ్ కంప్లీట్ అయినా.. విడుదల ఎప్పుడో తెలియని టాప్ హీరోల మూవీస్ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయా సినిమాలు అనుకున్న సమయానికే థియేటర్లలో జనాల ముందుకు వస్తున్నాయి.అయితే కొంత మంది పెద్ద హీరోలకు సంబంధించిన సినిమాలకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ డేట్లే ప్రకటించలేదు.

ఎందుకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తున్నారో అర్థం కాక ఆయా హీరో ఫ్యాన్స్ జట్టు పీక్కుంటున్నారు.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో అఖండ అనే సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది.అయినా ఇప్పటి వరకు సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయట్లేదు సినిమా యూనిట్.

అటు వెంకటేష్ హీరోగా చేసిన దృశ్యం-2 సినిమా కూడా చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది.కానీ ఇప్పటికీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియన పరిస్థితి నెలకొంది.

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కింది.ఈ సినిమా విడుదల విషయంలోనూ ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు.

Telugu Akhanda Movie, Balakrishna, Drushyam 2 Movie, Ghost Movie, Khiladi, Latest Movie Updates, Nagarjuna, Raviteja, Tollywood Heros, Venkatesh, Virata Parvam-Movie

అటు రానా హీరోగా విరాటపర్వం అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమా నిజానికి గత ఏడాదిలోనే విడుదల కావాలి.ఇప్పటికే మూడు సార్లు మూవీ రిలీజ్ డేట్లు ప్రకటించారు.ఏదో ఒక కారణంతో చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది.అయినా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది.అటు రవితేజ హీరోగా ఖిలాడీ అనే మూవీ తెరకెక్కింది.

యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో మాస్ మహారాజ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి విషయం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు.

#Khiladi #Akhanda #Nagarjuna #Ghost #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube