చాలా మందికి చాలా సినిమాలు ఫేవరెట్ గా ఉంటాయి.ఆ సినిమాలు తమకు ఎంతో నచ్చుతాయని చెప్తారు.
చాలా మంది సినిమా హీరోలు సైతం తమకు పలనా సినిమా అంటే ఇష్టం అని పలు షోలలో చెప్పిన సందర్బాలున్నాయి.అంతేకాదు.
పాత సినిమాల్లో ఏ సినిమా రీమక్ చేస్తే బాగుంటుందని అగిడితే ఒక్కో హీరో ఒక్కో సినిమా పేరు చెప్పాడు.మహేష్ బాబు మాత్రం అస్సలు రీమేక్ చేయనని చెప్పాడు.ఇంతకీ తెలుగు హీరోలు చెప్పిన ఆ రీమేక్ సినిమా ముచ్చట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్
తనకు గుండమ్మ కథ రీమేక్ చేయాలని ఉందన్నాడు.అదీ నాగచైతన్యతో కలిసి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పాడు.
చరణ్
గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ చేయాలని ఉన్నట్లు వెల్లడించాడు రాంచరణ్.
వరుణ్ తేజ్
కొదమ సింహం సినిమా రిమేక్ చేస్తే బాగుంటుందని చెప్పాడు.
మంచు విష్ణు
తన తండ్రి నటించిన భక్త కన్నప్ప సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందన్నాడు.
నితిన్
తొలి ప్రేమను రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పాడు.
నాగచైతన్య
తనకైతే హలో బ్రదర్ సినిమా రీమేక్ చేస్తే నటించాలని ఉందన్నాడు.
మంచు మనోజ్
బిల్ల రంగ సినిమా రీమేక్ చేస్తే తను నటిస్తాని చెప్పాడు.
బాలక్రిష్ణ
తనకు దాన వీర సూర కర్ణ, నర్తనశాల సినిమాలు రీమేక్ చేస్తే నటించాలని ఉందని చెప్పాడు ఈ నందమూరి నటసింహం.