టాలీవుడ్ హీరోలు వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు.. అవి చేసి ఉంటే ఇప్పుడు వేరేలా ఉండేది. ఆ హిట్ సినిమాలు ఎంటో చూడండి.

సినీ పరిశ్రమలో సక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు అంచనా వేయలేరు , ఒక్కొక్కప్పుడు సూపర్ హిట్ అవుతుంది అనుకునే కథలు డిజాస్టర్లు అవుతాయి , సినిమా మీద ఏమి అంచనాలు లేకుండా విడుదల అయి భారీ విజయాలు సొంతం చేసుకున్న సినిమా లు కూడా ఉన్నాయి.ఈ కథల ఎంపిక విషయం లో చాలా హిట్ కథలను మిస్ చేసుకున్నారు , కొన్ని కథలు నచ్చిన డేట్స్ కుదరక మరికొన్ని సినిమాలను వారి ఇమేజ్ కి సరిపోవని వదిలేసుకున్నారు.

 Tollywood Heros And The Hit Films They Rejected1-TeluguStop.com

ఆ కథలేంటో చూద్దాం

1.అర్జున్ రెడ్డి

తెలుగు సినిమాలో శివ తరువాత అంత ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి.ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ హిట్ గా నిలిచింది కానీ ఈ కథ ముందుగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కి వినిపించాడు అది కుదరక శర్వానంద్ కి చెప్పాడు , శర్వానంద్ కి కథ నచ్చిన తన ఇమేజ్ కి ఇలాంటి బోల్డ్ కథ సెట్ అవదేమో అని వదులుకున్నాడు, ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కాని శర్వానంద్ మాత్రం వదులుకున్నందుకు చాలా బాధ పది ఉంటాడు

2.సింహాద్రి

జూనియర్ ఎన్టీఆర్ కి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కి చాలా చేరువలో వచ్చింది , ఈ సినిమా తో చిరంజీవి గారి స్థాయి మార్కెట్ ను పెంచుకున్నారు తారక్.అయితే ఈ కథ రాసిన రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను బాలకృష్ణ కోసం తయారు చేసాడట , అది కుదరకపోవడం తో రాజమౌళి గారికి మళ్ళీ ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడం వల్ల సింహాద్రి తీశారు

3.శంకర్ జెంటిల్ మెన్

తమిళ దర్శకుడు శంకర్ సినిమాలెంటో దేశం మొత్తం తెలుసు కానీ ఆయన మొదటి సినిమా జెంటిల్ మేన్ సినిమాని ఆయన ముందుగా రాజశేఖర్ గారితో తీద్దామనుకున్నారు కానీ డేట్స్ కుదరక యాక్షన్ కింగ్ అర్జున్ తో తీశారు అది అప్పట్లో ఒక సంచలన చిత్రం .చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా కూడా రాజశేఖర్ గారు చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి గారూ చేశారు , దీనివల్లే చిరంజీవి కి రాజశేఖర్ కి గొడవలు అయ్యాయని చెప్తారు

4.పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమాల లిస్ట్

మెగాస్టార్ తమ్ముడిగా తెర కి పరిచయం అయిన తనకంటూ ప్రత్యేక స్థాయి అభిమననాన్ని సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ కి ఒకప్పుడు వరస విజయాలు ఉండేవి , యూత్ లో పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ ఉండేది.ఆయన వదులుకున్న సినిమాలు చేసి ఉంటే బాగుండేది అని అభిమానులు కోరుకుంటారు.

పూరి జగన్నాథ్ తీసిన బ్లాక్ బస్టర్స్ అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి , ఇడియట్ , పోకిరి వంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కి చెపితే నచ్చక వదిలేసాడు.త్రివిక్రమ్ మహేష్ బాబు కలయికలో వచ్చిన అతడు సినిమా కూడా పవన్ కళ్యాణ్ విన్న కథే , హరీష్ శంకర్ రెండవ సినిమా మిరపకాయ్ ముందుగా పవన్ దగ్గరకే వెళ్లిన కథ

5.పవన్ కళ్యాణ్ – తొలి ప్రేమ

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో గుర్తుండి పోయే సినిమా తొలిప్రేమ , ఈ కథ ముందుగా సుమంత్ తో చెప్పారట కరుణాకరన్ ఆయన చేయకపోవడం తో పవన్ కళ్యాణ్ తో తీశారు

6.దిల్ , ఎవడు , ఆర్య

ఈ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

వివి వినాయక్ తీసిన దిల్ సినిమా , సుకుమార్ మొదటి సినిమా ఆర్య , వంశీ పైడిపల్లి ఎవడు సినిమా కథలు ఎన్టీఆర్ కి వినిపించిన కథలే.ఇటీవల విడుదలైన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా ఎన్టీఆర్ కోసం రాసుకున్నారట ఆ సినిమా దర్శకులు వక్కంతం వంశీ

7.బాహుబలి

ఈ సినిమా లో బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం , అలాంటిది రాజమౌళి ముందుగా ఈ కథ ని బాలీవుడ్ హీరో లని పెట్టి తీద్దాం అనుకున్నారు వారు అయితే మార్కెట్ ఎక్కువ ఉంటుందని ఆలోచించాడు కానీ అవి కుదరకపోవడం తో మన ప్రభాస్ తో బాహుబలి తీసి తెలుగు సినిమా ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు

8.చంటి

విక్టరీ వెంకటేష్ కి మంచి పేరుతో పాటు అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా చంటి , ఇది తమిళ్ సినిమా దానిని ముందుగా రాజేంద్రప్రసాద్ గారు రీమేక్ చేయాలనుకున్నారు అప్పటికే వెంకటేష్ తో సినిమాని ప్రారంభిచారు

ఇంకా రవితేజ తీసిన భద్ర సినిమా అల్లు అర్జున్ చేయాలి కానీ ఆ సమయానికి ఆ కథ తనకి సెట్ అవదని వదులుకున్నాడు.వరుణ్ సందేశ్ తీసిన కొత్తబంగారు లోకం నాగ చైతన్య కోసం నాగార్జున గారికి వినిపిస్తే సెట్ అవదేమో అని చేయలేదు.ఇక పోతే గతేడాది సంక్రాంతి బరిలో వచ్చి పెద్ద సినిమాలకు పోటీగా విడుదలై ఘనవిజయం సొంతం చేసుకున్న శతమనం భవతి రాజ్ తరుణ్ చేయాలి కానీ దిల్ రాజు తో గొడవ కారణంగా అతన్ని తప్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube