బావమరదళ్ళ పాత్రల్లో మనల్ని మెప్పించిన 10 టాలీవుడ్ సినీ జంటలు వీరే.! మీకు నచ్చిన పెయిర్ ఎవరు?  

Tollywood Hero\'s and Heroines in Bava maradallu Roles -

కొన్ని సినిమాల్లో చూపించే క్యారెక్టర్స్ అలా కళ్లముందు కదలాడడమే కాదు.మనల్ని మనలోకి తొంగి చూసుకునేలా చేస్తాయి.

Tollywood Hero's And Heroines In Bava Maradallu Roles

ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో రిలేషన్స్ లోని డెప్త్ ను చాలా బాగా చూపిస్తారు.కొన్ని సార్లు ఎమోషనల్ గా కనెక్టయేలా కూడా చేస్తారు.భార్యభర్తల గిల్లికజ్జాల ను,బావా మరదళ్ల చిలిపి తగాదాలను తెలుగు సినిమాల్లో చూపినట్టుగా ఏ సినిమాల్లో చూపరు అనేది అతిశయోక్తి కాదు.100% లవ్ సినిమాలో నాగచైతన్య,తమన్నాల మధ్య రిలేషన్ ని సుకుమార్ చాలా బాగా తెరకెక్కించారు కదా…ఆ సినిమాలో బంధమెక్కడో సాంగ్ లో వచ్చే భార్యభర్తల మధ్య పెళ్లితోనే ముడిపడుతుంది.బావా మరదలి బంధం పుట్టగానే మొదలవుతుంది… లైన్ వింటే అది ఒప్పుకుని తీరాల్సిన నిజం అనిపిస్తుంది.సరే ఇప్పుడు మన సినిమాల్లోని బావా మరదళ్లను గురించి చూద్దామా…

1.

నాగచైతన్య ,తమన్నా : బాలు ,మహలక్ష్మీగా వీరిద్దరి రిలేషన్ సూపర్బ్ కదా.

2.రాజ్ తరుణ్ ,అవికా గోర్ …ఉయ్యాల జంపాల సినిమాలో వీరిద్దరి అల్లరి ఎంజాయ్ చేయనివారుండరు.

3.బాలక్రిష్ణ,సుహాసిని దంచవే మేనత్త కూతురా,వడ్లు దంచవే నా గుండెలదరా .అంటూ బాలక్రిష్ణ తన మరదలిని ఆటపట్టించడం ఇప్పటీకి ఎవరూ మర్చిపోరు.

4.సిద్దార్ద్,ప్రణిత.: మరదలుప్రణీత ప్రేమ గెలుచుకోవడం కోసం బావ సిద్దార్ద్ సైకిల్ పోటీలో గెలవడం గుర్తుందా…

5.మహేశ్ బాబు,త్రిష : పూరీగా త్రిష,పార్దుగా మహేశ్ నటించిన అతడు సినిమాలో వీరి ప్రేమకథ సూపర్బ్.

6.నాగార్జున,టబు : గ్రీకువీరుడు నా రాకుమారుడు అంటూ టబు పాడిన పాట,గ్రీకువీరుడుగా నాగ్ నిన్నే పెళ్లాడతా సినిమాలో బావా మరదలిగా నటించారు.

7.పవన్ కళ్యాణ్,సమంతా : అత్తారింటికి దారేది సినిమాలో సమంతా ,పవన్ కళ్యాణ్ బావామరదల్లుగా నటించారు.

8.రాంచరణ్,కాజల్ : గోవిందుడు అందరివాడేలే సినిమాలో చెర్రీ ,కాజల్ బావామరదలిగా నటించారు.ఉమ్మడి కుటుంబాలను,రిలేషన్స్ని చాలా చక్కగా తెరకెక్కించే కృష్నవంశీ ఈ సినిమాకు దర్శకుడు.

9.శర్వానంద్,అనుపమ : ఈ సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది శతమానం భవతి.ఆ సినిమాలో శర్వానంద్,అనుపమ బావామరదలి గా నటించారు.

10.మహేశ్ బాబు,సోనాలి బింద్రే : మురారి సినిమాలో మహేశ్ బాబు,సోనాలిబింద్రే బావా మరదల్లుగా నటించి అందరిని అలరించారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Hero's And Heroines In Bava Maradallu Roles Related Telugu News,Photos/Pics,Images..