అదిరిపోయే స్టెప్పులతో అదరగొడుతున్న టాలీవుడ్ టాప్ హీరోలు..

Tollywood Heros And Dancing Skills

టాలీవుడ్ హీరోస్ అంతా మళ్లీ ట్రాక్ మీదికి ఎక్కారు.గడిచిన రెండు సంవత్సరాలుగా సినిమా పరిశ్రమ అంతా డల్ గా మారిపోయింది.

 Tollywood Heros And Dancing Skills-TeluguStop.com

గడిచిన కొద్ది నెలలుగా మళ్లీ సెట్ బ్యాక్ అవుతోంది.టాప్ హీరోలంతా ప్రకటించిన టైమ్ బాండ్ ప్రకారమే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

అయితే ఇప్పటి వరకు యాక్షన్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఇప్పుడు అదరగొట్టే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.మహేష్ బాబు నుంచి రాంచరణ్ వరకు అంతా దుమ్మురేపే డ్యాన్సులు చేస్తున్నారు.

 Tollywood Heros And Dancing Skills-అదిరిపోయే స్టెప్పులతో అదరగొడుతున్న టాలీవుడ్ టాప్ హీరోలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాస్ మహారాజా రవితేజ కూడా మాంచి ఊపిచ్చే స్టెప్పులు వేసేందుకు సిద్ధం అవుతున్నాడు.రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ, మీనాక్షి, డింపుల్ హయాతి కలిసి నటిస్తున్న తాజా సినిమా ఖిలాడి.

ఈ సినిమాకు సంబంధించ పాటను చిత్రీకరిస్తున్నారు.దేవిశ్రీ మ్యూజిక్, యష్ క్రేజీ కొరియోగ్రఫీతో రవితేజ అదరగొతున్నాడట.

అటు దిగ్గజ దర్శకుడు శంకర్ తో కలిసి రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన షెడ్యూల్ పూర్తియ్యింది.పూణెతో పాటు లోనావాలా ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాలని భావిస్తన్నారు.

అందమైన ప్రదేశాల్లో చరణ్ తో స్టెప్పులువేయించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.థమన్ సంగీతం అందిస్తున్నాడు.కియారా హీరోయిన్ గా చేస్తుంది.

అటు మహేష్ బాబు కూడా ఓ పాట షూటింగ్ కోసం స్పెయిన్ కు వెళ్లాడు.పరుశరాం దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

వీళ్లిద్దరి మధ్య ఓ లవ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారట.

అటు నాని హీరోగా వివేక్ ఆత్రేయ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు.దాని పేరు అంటే సుందరానికి.ఈ సినిమాకు సంబంధించి కూడా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.ఇందులో నానికి తోడుగా నజ్రియా హీరోయిన్ పాత్ర పోషిస్తుంది.సినిమాల విషయంలో బాగా ప్రయోగాలు చేస్తున్న నాని.ఇందులో మంచి పాటలను పెడుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి ఈసినిమా షూటింగ్ శర వేగంగా నడుస్తుంది.

#Sarkaruvaripata #Mahesh Babu #Nani #Raviteja #Shanker

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube