Heroes Books: తెలుగు సినిమాలు - పుస్తకాలు ..వీరికి ఎలాంటి సంబంధం లేదు కదా ?

సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు విజ్ఞానం కూడా అని చెప్పే సంఘటనలు బోలెడు.అలాంటి ఒక విషయం పుస్తకాలు.

 Tollywood Heros And Books Guppedu Manasu Surya Jai Bhim Details, Tollywood Heroe-TeluguStop.com

సినిమాల్లో కనిపించే అద్భుతమైన పుస్తకాలు.ఉదాహరణకు దర్శకుడు బాలచందర్ తీసిన గుప్పెడు మనసు సినిమా.

ఈ సినిమా 1979 లో విడుదల అయ్యింది.ఈ చిత్రంలో నటి సుజాత చేతిలో Future Shock అనే బుక్ ఉంటుంది.

ఈ బుక్ 1970 లో Alvin Toffler అనే రైటర్ రాసాడు.తెలుగు సినిమాల్లో ఆనాటి రోజుల్లో ఇలాంటి ఒక సీన్ ఉండటం చాల మందికి సహజమే కావచ్చు కానీ ఆ బుక్ విలువ తెలిసిన వాళ్లకు దర్శకుడు ఎంత దూరం ఆలోచించాడో అర్ధం అయితే ఆ సీన్ విలువ అర్ధం అవుతుంది.

ఇక గుప్పెడు మనసు సినిమా మంచి విజయం సాధించింది.

నిజానికి మన ముందు ఎవరైనా పుస్తకాలు, పేపర్లు చదువుతూ కనిపిస్తే వారిని మనం గౌరవిస్తాం.

అలాగే ఎవరైనా రౌడీ లాగ కొడుకు కనిపిస్తే వారికి దూరంగా ఉంటాం.కానీ సినిమాల్లో ఆలా కాదు.హీరో అమ్మాయి వెనక పడుతుంటే, లేదంటే నలుగురిని చితక బడుతుంటే హీరోయిజం అంటాం.అసలు సినిమాల్లో హీరోలు బుక్స్ చదివే సీన్స్ చాల అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.

ఒక వేల చదివిన కూడా కేవలం పేరుకే బుక్ పట్టుకున్నట్టు ఉంటాయి.అంత డీసెంట్ హీరోలను ఎవరు ఇష్టపడరు కూడా.

పిచ్చి పిచ్చిగా కనిపించే వల్లనే బాగా ఇష్టపడటం అలవాటు.

Telugu Books, Balachander, Shock, Guppedu Manasu, Surya, Heroes Books, Sujatha,

ఇక కమెడియన్స్ సినిమాలో పేపర్ చదివిన కూడా క్రైమ్ సీన్స్ చదువుతూ, పక్క వారిని నవ్వించే న్యూస్ చదువుతూ ఉంటారు.ఇక నిజ జీవితంలో అయితే ఇప్పటి వరకు ఏ హీరో కూడా బుక్ షాప్ కి ఓపెనింగ్ కి వచ్చారా అంటే అలాంటి హిస్టరీ లేదు.ఇందులో విజయ దేవరకొండ కు కొంత మినహాయింపు ఇవ్వచ్చు.

అన్వీక్షికి ప్రచురణ సంస్థ ప్రారంభోత్సవానికి అతడు వెళ్ళాడు.ఇక డైరెక్టర్స్ విషయానికి వస్తే హీరో పేపర్ చదివే సీన్స్, లేదంటే బాత్ రూమ్ కి వెళ్లే సీన్స్ అన్ని మీకు నచ్చినట్టే తీయాలా అంటారేమో.

ఏది ఏమైనా ఇప్పటికైనా ఒక హీరో అద్భుతమైన బుక్ చదువుతూ కనిపిస్తే ఫాలో అయ్యే మనలాంటి వారు కూడా ఉంటారు.ఇటీవల సూర్య సైతం ఒక బుక్ చదువుతూ భీం సినిమాలో కనిపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube