తండ్రి, కొడుకు రెండు పాత్రలలో నటించిన హీరోలు వీళ్ళే..!!

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఎన్నో సినిమాలో నటించారు.ఇక ద్విపాత్రయంలో కనిపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 Tollywood Heros Acted As Father And Son, Akkineni Nagarjuna, Jr .ntr, Mahesh Bab-TeluguStop.com

ఇక కొన్ని సినిమాలో అదే హీరో తండ్రిగా, కొడుకుగా నటించారు.అలాంటి సినిమాల గురించి ఒక్కసారి చూద్దామా.

అక్కినేని నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయన సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో నాగార్జున బంగార్రాజు అయిన తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ఆంధ్రావాలా.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రలో కనిపించారు.మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా నాని.ఈ చిత్రంలో ఒక సీన్ లో మహేష్ బాబు తండ్రిగా, అలాగే కొడుకుగా కనిపించారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా అందరివాడు, ఈ సినిమాలో చిరంజీవి తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా సింహ, చెన్నకేశవరెడ్డి.

ఈ రెండు సినిమాలో నందమూరి బాలకృష్ణ తండ్రిగా, కొడుకు రెండు పాత్రలో నటించారు.దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా బాహుబలి.

ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలో తండ్రిగా, అలాగే కొడుకుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Telugu Balakrishna, Chirenjeevi, Heros, Jr Ntr, Mahesh Babu, Prabhas, Raviteja,

రవితేజ రీసెంట్ నటించిన సినిమా డిస్కో రాజా.ఈ సినిమాలో కమెడియన్ సునీల్ విలన్ పాత్రలో కనిపించారు.అయితే డిస్కో రాజా సినిమాలో రవితేజ తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రలను పోషించారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్.ఈ సినిమాను తెలుగులో 24గా డబ్బింగ్ చేశారు.ఈ చిత్రంలో తండ్రి కృష్ణన్ గా, అలాగే కొడుకు సూర్యగా ప్రేక్షకులను అలరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube