సెలబ్రిటీలకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తాయి.మరికొందరు హీరోయిన్లు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తమకు సంబంధించి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.
పనిలో పనిగా తమ ఫోటో షూట్లతో పాటు చిన్నప్పటి విషయాలను డిస్కస్ చేస్తారు.అలాగే టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోయిన్లు తమ చైల్డ్‌వుడ్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఇంతకీ సదరు హీరోయిన్లు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మీరూ చూడండి!
సమంతా:
టాలీవుడ్‌లో మోస్ట్ ఫ్యాషనబుల్ హీరోయిన్ సమంతా.స్టైలిష్ డ్రెస్సులతో అందరి చేత వారెవ్వా అనిపించుకుంటుంది.ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండును సెట్ చేస్తోంది.ఇక ఈమె చిన్న తనంలో దిగిన ఫోటో చాలా అందంగా ఉంది.చీరకట్టులో ఒదిగిపోయి బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.
సాయి పల్లవి:
ఒకప్పటి డ్యాన్సర్ అయిన హీరోయిన్ సాయి పల్లవి చిన్నప్పుడు మస్తు అల్లరి అమ్మాయి.తన కాలేజీలో తోటి అమ్మాయిని ఆటపట్టిస్తూ ఉన్న ఫోటోను తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టింది.తను అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది.పెద్ద మార్పులేమీ కనిపించడం లేదు.
రకుల్ ప్రీత్ సింగ్:
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.సైనిక్ స్కూల్లో చదివిన ఈ ముద్దుగుమ్మ చాలా టాలెంటెడ్ అమ్మాయి.కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తీసుకున్న ఫోటోను తాజాగా నెట్టింట్లో పెట్టింది.ఆవిడలో అప్పుడు ఇప్పుడు పెద్దగా ఢిపరెన్స్ ఏమీ లేదు.
పూజా హెగ్డే:
తన స్కూల్ డేస్‌లో క్యూట్‌గా ఉన్న ఈ బ్యూటీ.ఇప్పుడు మరింత హాట్‌గా మారింది.అప్పటి ఇప్పటికి తనను గుర్తు పట్టలేని విధంగా మారింది.చిన్నప్పుడు ఐస్ క్రీం తింటున్నప్పుడు తీసుకున్న ఈ ఫోటోను ఈ మధ్యే తను సోషల్ మీడియాలో పెట్టింది.
కీర్త సురేష్:
జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన ఈ అమ్మాయి చిన్నప్పుడు ఎంతో అమాయకంగా ఉంది.తాజాగా తన కాలేజీ డేస్‌కు సంబంధించిన పాస్ పోర్టు సైజు ఫోటోను ఆమె ట్విట్టర్‌లో పెట్టింది.
రష్మిక:
రష్మిక చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉంది.స్కూల్ యూనిఫాంలో దిగిన ఈ ఫోటో ఎంతో ముద్దుగా ఉంది.అప్పటికీ ఇప్పటికీ మరింత అందంగా తయారైంది.
తమన్నా:
ఈ మిల్కీ బ్యూటీ తన స్కూల్ డేస్‌లో హోలీ సందర్భంగా తీసుకున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.తను అప్పుడు ఉన్నట్లే.ఇప్పుడూ ఉంది.గుర్తు పట్టలేని విధంగా మార్పులు లేవు.
కాజల్ అగర్వాల్:
ఈమె స్కూలింగ్ ముంబైలో కొనసాగింది.సెయింట్ యాన్స్ హైస్కూల్లో ఉన్నప్పుడు తీసుకున్న గ్రూప్ ఫోటోను ఈ మధ్య సోషల్ మీడియాలో పెట్టింది.తొలి వరుసలో షార్ట్ హెయిర్‌తో క్యూట్ గా ఉంది కాజల్.
.