ఈ టాలీవుడ్ హీరోయిన్స్ నిజ జీవితంలో కూడా కిడ్నాప్ కి గురయ్యారు

రాజ్ కుమార్

Telugu Bhavana, Celebrities Real Life, Kannada Hero Raaj Kumar, Kidnap, Kidnap Story, Namitha, Sonali Bendre, Tollywood Heroines, Tollywood Heroines Who Were Kidnapped In Real Life-Telugu Stop Exclusive Top Stories

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుగానే కన్నడ ఇండస్ట్రీ లో కూడా చాలా మంది హీరోలు వాళ్ళకంటూ స్వతహాగా గుర్తింపు సాధించుకున్నారు వారిలో రాజ్ కుమార్ కూడా ఒకరు తెలుగులో మనం మెగాస్టార్ చిరంజీవిని చాలా గొప్ప హీరోగా చూస్తాం.అలాగే కన్నడలో కూడా రాజ్ కుమార్ గారిని కూడా ఒక మెగాస్టార్ లాగా చూస్తారు.కన్నడలో ఆయన తీసిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి అలాంటి హీరోని ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వీరప్పన్ 2000 సంవత్సరంలో కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించాడు.108 రోజులపాటు అతన్ని తనతోనే ఉంచుకొని తర్వాత సేఫ్ గా మళ్లీ పోలీస్ వాళ్లకి అప్పజెప్పాడు.అయితే రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో వీరప్పన్ ని ఎలా చంపారో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు కానీ ఒక స్టార్ హీరో అయినా రాజ్ కుమార్ గారిని వీరప్పన్ కిడ్నాప్ చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన విషయం…

 Tollywood Heroines Who Were Kidnapped In Real Life-TeluguStop.com

నమిత

తెలుగులో సొంతం సినిమాతో పరిచయమైన నమిత ఆ తర్వాత తెలుగులో మంచి సినిమాలు చేసింది.తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి సినిమాలు చేసిన నమిత తమిళంలో మంచి క్రేజ్ సంపాదించింది.తమిళనాడు ప్రేక్షకులు ఆమె అభినయానికి వీరాభిమానులు అయ్యారు.నమిత తెలుగులో బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమాలో బాలకృష్ణ పక్కన ఆడిపాడింది.అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన బిల్లా సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మంచి మార్కులు కొట్టేసింది.అయితే తమిళ ప్రేక్షకులు నమిత కి ఏకంగా గుడి కట్టారు.

అలాంటి నమిత ని తన అభిమాని అని చెప్పు కు తిరిగే వ్యక్తి ఒకడు తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు కిడ్నాప్ చేసి తనని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడు.కానీ నమిత వాడి ప్లాన్ ని తెలుసుకొని తప్పించుకుంది.

 Tollywood Heroines Who Were Kidnapped In Real Life-ఈ టాలీవుడ్ హీరోయిన్స్ నిజ జీవితంలో కూడా కిడ్నాప్ కి గురయ్యారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భావన

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మహాత్మ సినిమా లో శ్రీకాంత్ కి జోడీగా భావన నటించింది ఆమె నటనకి తెలుగులో మంచి మార్కులు పడ్డాయి తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ భావన మలయాళంలో చాలా సినిమాలు చేసింది అక్కడ మంచి హీరోయిన్ గా తనకు గుర్తింపు లభించింది.అయితే తనని కొంత మంది కిడ్నాప్ చేశారని అప్పట్లో న్యూస్ వచ్చింది.ఆ కిడ్నాప్ ని ఆరాతీస్తే అది చేయించింది మలయాళం సూపర్ స్టార్ అయిన దిలీప్ అని తెలియడంతో దిలీప్ నీ పోలీసులు అరెస్టు చేశారు.

సోనాలి బింద్రే

ప్రేమికులరోజు సినిమాలో కునాల్ పక్కన హీరోయిన్ గా నటించిన సోనాలి బింద్రే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన మురారి సినిమాలో నటించి తన నటన ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు చూపించింది.ఆ తర్వాత ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా నటించి కనిపించేది కొద్దిసేపే అయిన ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది.అయితే సోనాలి బింద్రే ని కూడా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అయిన షోయబ్ అక్తర్ లవ్ చేశాడు ఎంతలా అంటే తన వాలెట్ లో సోనాలి బింద్రే ఫోటో ఉండేది కుదిరితే తనను పెళ్లి చేసుకోవాలని చూశాడు కాని విషయం సోనాలి బింద్రే దాకా వెళ్లకపోవడంతో కామ్ అయిపోయాడు.షోయబ్ అక్తర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నేను సోనాలి బింద్రే ని డీప్ గా లవ్ చేసాను కానీ ఆ విషయాన్ని తనకు చెప్పలేదు ఒకవేళ నేను చెబితే ఆమె ఒప్పుకోక పోతే ఆమెను కిడ్నాప్ చేసి అయిన పెళ్లి చేసుకునే వాడిని అని చెప్పాడు.

షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి తన ఫాస్ట్ బౌలింగ్ గురించి తెలిసి ఉంటుంది… ఏది ఏమైనప్పటికీ ఇలా సెలబ్రిటీస్ ని కిడ్నాప్ చేయడం అనేది చాలా దుర్భరమైన ఆలోచన.

#Kidnap #Kidnap Story #Namitha #KannadaHero #CelebritiesReal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు