టీచర్ పాత్రల్లో నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..?

సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలు పోషిస్తే మాత్రమే హీరోలకైనా, హీరోయిన్లకైనా స్టార్ స్టేటస్ సొంతం కావడంతో పాటు ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయి.టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు టీచర్ పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు.

 Tollywood Heroines Who Played  Lecturer Roles In Her Films,latest Tollywood News-TeluguStop.com

ఆయా పాత్రలకు హీరోయిన్లు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంతో ఆ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.

Telugu Asin, Saipallavi, Shrutihassan, Teacher, Tollywood-Movie

స్టార్ హీరోయిన్ అసిన్ గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఘర్షణ సినిమాలో టీచర్ పాత్రలో బాగా నటించారు.సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ సినిమా సరిలేరు నీకెవ్వరులో లెక్చరర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.మలయాళంలో హిట్టైన ప్రేమమ్ సినిమాలో సాయిపల్లవి లెక్చరర్ రోల్ లో అద్భుతంగా నటించగా తెలుగులో హిట్టైన ప్రేమమ్ సినిమాలో మాత్రం శృతిహాసన్ లెక్చరర్ రోల్ లో నటించడం గమనార్హం.

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఇలియానా అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన ఖతర్నాక్ సినిమాలో టీచర్ రోల్ లో నటించారు.సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని ఆరాధన సినిమాలో, స్వామి గోల్కొండ హైస్కూల్ సినిమాలో, కమిలినీ ముఖర్జీ హ్యాపీడేస్ సినిమాలో టీచర్ రోల్ లో నటించారు.

అనుపమ రాక్షసుడు సినిమాలో టీచర్ గా నటించగా నయనతార నేనే అంబాని సినిమాలో టీచర్ గా నటించడం గమనార్హం.

Telugu Asin, Saipallavi, Shrutihassan, Teacher, Tollywood-Movie

సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో టీచర్ రోల్ లో నటించారు.స్టార్ హీరోయిన్ సమంత సైతం టీచర్ రోల్ లో నటించారు.సీమ రాజా అనే సినిమాలో సమంత స్పోర్ట్స్ టీచర్ గా నటించడం గమనార్హం.

తమ పాత్రల ద్వారా ఈ హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఈ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube