ఈ స్టార్ హీరోయిన్స్ ని సినిమాల నుండి ఎందుకు బ్యాన్ చేసారు..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలదే హవా నడుస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీలో మగాళ్ళది పెత్తందారీ వ్యవస్థ ఎక్కువగా నడుస్తుంది హీరోయిన్స్ అయిన లేదా లేడీ ఆర్టిస్ట్ ఎవరైనా సరే మగాళ్లు చెప్పినట్టే వినాలి అన్నట్టుగా ఇండస్ట్రీలో కొందరి మగవాళ్ళ బిహేవియర్ ఉంటుందని చాలాసార్లు బయట టాక్ వినిపిస్తూనే ఉంటుంది.దీంతోపాటు కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే చాలామంది ఆడవాళ్ళ నీ కూడా లైంగికంగా వేధిస్తూ ఉంటారు.

 Tollywood Heroines Who Got Banned From Movies, Tollywood Heroines, Jamuna, Film-TeluguStop.com

కొందరు ఇలాంటి విషయాలు బయట పెడితే కెరీర్ నాశనం అవుతుందేమోనని భయపడి వదిలేస్తే మరికొందరు మీడియా ముందుకు వచ్చి వారి బాధను కూడా జనానికి తెలియజేశారు.మగవారి లైంగికంగా వేధిస్తున్నారని దానికి నిరాకరించిన ఆడవాళ్లపై నిషేధం విధిస్తూ ఉంటారు అనే ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో నడుస్తుంది.అలా మగ వారి బారిన పడిన చాలామంది లేడి ఆర్టిస్ట్ ల మీద నిషేదం విధించడం జరిగింది వారెవరో ఇప్పుడు చూద్దాం…

Telugu Jamuna, Tollywood-Telugu Stop Exclusive Top Stories

సీనియర్ నటి అయిన జమున గారి ని కూడా అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి సీనియర్ హీరోలు కూడా ఆమెని వేధించేవారని ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెని పెద్ద హీరోలతో సినిమాలు చేయకూడదు అని ఆమెపై నిషేధం విధించారు.దాంతో ఆమె సెకండ్ గ్రేడ్ హీరోలైన జగ్గయ్య గారు లాంటి వారితో సినిమాల్లో నటించారు అలాంటి సీనియర్ హీరోయిన్ కె ఇండస్ట్రీలో వేధింపులు తప్పనప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

Telugu Jamuna, Tollywood-Telugu Stop Exclusive Top Stories

చిరంజీవి లాంటి పెద్ద హీరోలందరితో నటించి మంచి గుర్తింపు పొందిన రాధిక.తన చెల్లెలు నిరోషా ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.చిరంజీవి లాంటి హీరో తో కూడా స్టువర్టపురం పోలీస్ స్టేషన్ సినిమా చేసింది.

అయితే తన మేకప్ మెన్ దగ్గర నుంచి వచ్చే వేధింపులను ఎదుర్కోలేక దానితో విసిగిపోయి నిరోష ఒకరోజు అతని చెంపపై కొట్టింది దాంతో మేకప్ అసోసియేషన్ అంతా ఒకటై తనకు వ్యతిరేకంగా ధర్నా చేశారు దాంతో ఆవిడని కొన్నిరోజులపాటు సినిమా ఇండస్ట్రీ నుంచి నిషేధం విధించారు.

Telugu Jamuna, Tollywood-Telugu Stop Exclusive Top Stories

హీరో రాజేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే అప్పట్లో కామెడీ హీరో గా ఒక వెలుగు వెలిగిన రాజేంద్రప్రసాద్ స్టార్ కామెడీ హీరోగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి హీరో గురించి తెలియని మనిషి ఉండడు.మాయలోడు,రాజేంద్రుడు గజేంద్రుడు, అప్పుల అప్పారావు లాంటి చాలా సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజేంద్రప్రసాద్.అయితే రాజేంద్ర ప్రసాద్ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో హీరోయిన్ గా నటించిన మాళవిక గారిని లైంగికంగా వేధించాడని ఆమె కేసు కూడా పెట్టింది దాంతో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కలగజేసుకుని రాజేంద్ర ప్రసాద్ నీ మందలించకుండా మాళవిక పై కొన్ని రోజుల పాటు సినిమాల్లో నటించకూడదని నిషేధం విధించారు.

Telugu Jamuna, Tollywood-Telugu Stop Exclusive Top Stories

v.n ఆదిత్య డైరెక్షన్లో నవదీప్ హీరోగా వచ్చిన సినిమా మనసు మాట వినదు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ అయిన అంకిత ని నవదీప్ లైంగికంగా వేధించాడని ఆమె ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ కి చెప్పింది అయిన కూడా నవదీప్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంకిత పై కొన్ని రోజులు నిషేధం విధించారు.
ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి ఒక తప్పు చేస్తే ఇంకొకరిని శిక్షించడం అనేది ఆనవాయితీగా జరుగుతూనే వస్తోంది.రీసెంట్ గా కాస్టింగ్ కౌచ్ పేరుతో చాలామంది వాళ్లను వేధించారని చాలా మంది ఆర్టిస్టులు బయటకు వచ్చి వాళ్ళ బాధని సినిమా పెద్దలతో పాటు ప్రేక్షకులు కూడా తెలియ చేశారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది వాకాడ అప్పారావు లాంటి వారు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిర్వహించి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారిని బాగా వాడుకుంటారు అని అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు పెను దుమారమే లేపాయి.

ఇప్పటికైనా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు పట్టించుకోని అందరికీ సమన్యాయం చేయాలని కోరుకుందాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube