ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వారంతా స్టార్ హీరోయిన్స్..ఎవరో చెప్పుకోండి చూద్దాం

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్ కదా.హీరో అయినా హీరోయిన్ అయినా చూడ్డానికి అందంగా ముద్దు ముద్దుగా ఉంటే ఈ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు రాణించగల్గుతారు.

 Tollywood Heroines Who Are Unrecognizable-TeluguStop.com

ప్రజలు కూడా వారిని బాగా ఆదరించగల్గుతారు.అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ప్రేక్షకులు బాగా ముదిరిపోయారు.

ఇప్పటి ప్రేక్షకులు అందానికే కాదు వాళ్ళు పండించే నటనకి కూడా మార్కులు వేస్తున్నారు.అలా అందంలో అంతంత మాత్రంగానే ఉన్న హీరోయిన్స్ కొంతమంది వారి నటనకు మంచి మార్కులు వేయించుకొని ఇప్పుడు వివిధ భాషల్లో అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు.ఇప్పుడు వాళ్లెవరో వాళ్ళు ఈ రంగంలోకి రాకముందు ఎలావుండేవారో ఫొటోలతో సహా చూద్దాం…

 Tollywood Heroines Who Are Unrecognizable-ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వారంతా స్టార్ హీరోయిన్స్..ఎవరో చెప్పుకోండి చూద్దాం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో మొదటిగా.RX100 బ్యూటీ పాయల్ రాజపుత్ గురించి మాట్లాడుకోవాలి.ఢిల్లీలో పుట్టిపెరిగిన ఈ అందాల భామా అందాల ఆరబోతలో అస్సలు వెనుకాడదు.డైరెక్టర్ ఎం చెప్తే దానిని కాదనకుండా వందకి వందశాతం తన పాత్రకు న్యాయం చేసే అమ్మాయి.RX100 లో మంచి నాటు కన్నింగ్ అమ్మాయి పాత్రలో, వెంకీ మామలో కామెడీ పాత్రలో, డిస్కోరాజాలో మాటలు రాని అమ్మాయి పాత్రలో ఇంకా ఇటీవలే ఆహ లో విడుదలైన అనగనగా ఒక అతిథి అనే సినిమాలో డీ గ్లామరస్ గా వైలెంట్ పాత్రలో ఇలా ఒక్కో సినిమాకి తన నటనను ప్రూవ్ చేస్కుంటూ దూసుకెళ్తున్న ఈ అమ్మడు ఇప్పుడు ఎంతో నాజూగ్గా వయ్యారంగా తయారయ్యింది గాని ఈమె సినిమాల్లోకి రాకముందు ఎలావుండేదో ఈ కింద పిక్ చూస్తే అర్థమైపోతుంది.ఇప్పుడు ఈ పిక్ చూస్తే ఎవరు గుర్తుపట్టరేమో.

ఇక ఆ తర్వాత నాని చేసిన “జెర్సీ” సినిమాలో మెరిసిన ఈ అమ్మడును గుర్తుపట్టారా.ఈమె రీసెంట్ గా లాక్డౌన్ లో విడుదలైన కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలో కూడా అదిరిపోయే క్యారెక్టర్ చేసి సూపర్ యాక్ట్రెస్ అనిపించుకుంది.నిజమే ఈమె మంచి నటినే.ఈమెకి కన్నడలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఈమె మన తెలుగులో సమంత చేసిన యూటర్న్ సినిమాని కన్నడలో చేసింది ఈమెకి ఆ సినిమాకి గాను ఫిలిం ఫేర్ అవార్డు అలాగే సైమా అవార్డ్ కూడా అందుకుంది.అయితే ఈమె నిజంగా ఒక మంచి నటి అవ్వాలనుకొని సినిమాల్లోకి రాలేదు.

గ్రాడ్యువేషన్ అవ్వగొట్టి ఒక MNC కంపెనీలో పని చేస్కుంటు ఒక నార్మల్ అమ్మాయిలా ఉండేది.కానీ ఆమె లుక్స్ చాలా బాగుండటంతో మోడలింగ్ లోకి రావాలని చాల మంది అడిగారట.

అయితే అప్పుడు ఎక్కువ సమయం కూర్చొని పని చేయడం వల్ల బాగా లావుగా కూడా ఉండేది.దాంతో ఆమె బాడీ షేప్ చేసుకొని బాగా సన్నగా నాజూగ్గా తయారై మోడలింగ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటూనే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టి సక్సెస్ అయింది.అయితే అప్పుడు కంపెనీలో జాబ్ చేస్తున్నప్పటి పిక్ ఒకసారి చూడండి ఎంత బబ్లీగా ఉందొ అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం కదా!

ఇక మూడోవ హీరోయిన్ వచ్చేసి అచ్చమైన మన తెలుగింటి అమ్మాయి ప్రియాంక జువాల్కర్.ఈమెపేరు చూస్తే ఏ నార్త్ అమ్మాయి అనుకుంటారు.కాని ప్రియాంక అనంతపురం పిల్లని ఎక్కువమందికి తెలియదు.విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు రాజా రాణి సినిమా హీరో కిరణ్ అభివరం తో కలిసి SR కల్యాణమండపం సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఆ పాటల్లో ప్రియాంకా ఎంతో అందంగా ముద్దుగా కనిపిస్తుంది.అయితే ఈమె సినిమాలోకి రాకముందు ఫొటోస్ చూస్తే మాత్రం మనం అస్సలు గుర్తుపట్టలేం.అలా ఉంటుంది మరి.మీరు కావాలంటే ఈ హీరోయిన్ ఓల్డ్ ఫోటో పై ఒక లుక్ వేయండి.

#PayalRajput #ShraddhaSrinath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు