టాలీవుడ్ లో ఎవరి మాట లెక్కచేయని హీరోయిన్స్ వీళ్ళే

ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు టాలెంట్ తో పాటు కొన్ని పద్ధతులను సర్దుకుపోయే తత్వాన్ని కూడా అలవర్చుకోవాలి.అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సర్దుకుపోయే తత్వం ఉన్న హీరోయిన్స్ కరువు అయ్యారనే చెప్పాలి.

 Tollywood Heroines Who Are Having Ego Problems-TeluguStop.com

ఒకప్పుడు పాత సినిమాలోని హీరోయిన్స్ ని ఒకసారి మనం గమనించినట్లైతే డైరెక్టర్ ఏ టైం చెప్తే ఆ టైం కి రావడం, ప్రొడ్యూసర్ అంటే గౌరవం ఇవ్వడం, ఇక వారితో పాటు నటించే హీరో దగ్గర్నుండి క్యారెక్టర్ ఆర్టిస్టులందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతో జాలిగా సినిమా షూటింగ్ లో పాల్గొనేవారన్న సంగతి మనందరికీ తెలిసిందే.కానీ ఇప్పుడున్న హీరోయిన్స్ కి అణకువగా ఉండడం, సర్దుకు పోవడం అనే పదాలకి అర్థమే తెలియదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు అరకొర హిట్ సినిమాలతో తలపొగరు నెత్తికి ఎక్కించుకొని అటు డైరెక్టర్కి ఇటు తనతోపాటు నడుస్తున్న హీరోలకి కూడా చుక్కలు చూపిస్తున్నారట కొంతమంది హీరోయిన్స్.సో ఇప్పుడు మనం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హెడ్ వెయిట్ ఉన్న హీరోయిన్స్ గురించి మాట్లాడుకుందాం.

 Tollywood Heroines Who Are Having Ego Problems-టాలీవుడ్ లో ఎవరి మాట లెక్కచేయని హీరోయిన్స్ వీళ్ళే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ లిస్ట్ లో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ సాయి పల్లవి ది.సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో తను నవ్వుతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న సాయి పల్లవి సినిమా స్టార్ట్ అయిందంటే చాలు గొడవలే గొడవలు.ఒక్క హీరో వరుణ్ తేజ్ తో తప్ప మిగతా హీరోలందరితో చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పేచీలు పెట్టుకుందని, ఈమెకున్న అట్టిట్యూడ్ కి దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌస్ లు ఈమె హీరోయిన్ గా తీసుకోవడానికి వెనక్కి తగ్గుతున్నట్టు గా సమాచారం.

ఇక ఈ లిస్ట్ లో రెండో పేరు వచ్చేసి మన అందాల కుట్టి నిత్యా మీనన్.ఈమె నాచురల్ నటనకీ మన కుర్రాళ్లు ఫిదా అయిపోయి ఈమెకి ఎన్నో హిట్లు ఇచ్చినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈమెకి ఈగో ఎక్కువ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.దానికి నిత్యామీనన్ ఈగోకి ఆత్మాభిమానానికి మధ్య ఒక చిన్న గీత ఉంటుందని నాది ఆత్మాభిమానమని, నన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేనని, ఎవరైనా అవమాన పరచాలని ప్రయత్నిస్తే వారికి గట్టిగా సమాధానం ఇస్తానని ఇది నా దృష్టిలో ఆత్మఅభిమానమే కానీ ఈగో కాదంటూ ఎన్నోసార్లు ప్రెస్మీట్లో చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా ఇటీవల నిత్యా మీనన్ బరువు గురించి ప్రశ్న అడిగిన ఒక రిపోర్టర్ కి తన స్థాయిలో ఒక సివంగిలా రెచ్చిపోయి సమాధానం ఇచ్చిందట.అంతేకాదు ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా ఎంత పెద్ద హీరో అయినా ఈమెకు నచ్చకపోతే నచ్చలేదని మొహమాటంలేకుండా చెప్పేస్తుందట.

ఇక ఈలిస్ట్ లో అందాల భామ కాజల్ పేరు కూడా ఉంది.ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ భామకి మొదటి నుంచి కూడా కాస్త హెడ్ వెయిట్ ఎక్కువే అన్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.అప్పుడు ఎప్పుడో ఒకసారి కాజల్ ప్రెస్ మీట్ పెట్టిందట అయితే ఆ ప్రెస్మీట్ 10 గంటలకు అని చెప్పి తీరిగ్గా కాజల్ ఒంటి గంటకు వచ్చి అప్పటి వరకు వెయిట్ చేస్తున్న మీడియా వాళ్ళకి సారీ కూడా చెప్పలేదట.దాంతో మీడియా వాళ్లకి మండిపోయి ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయబోయారట.

చివరికి పరిస్థితులను అర్థం చేసుకున్న కాజల్ సారీ చెప్పిందట అంతటితో పరిస్థితులు సద్దుమణిగాయి.

ఇక ఈ లిస్ట్ లో వయ్యారాలు ఒలకబోసే వయ్యారి భామ ఇలియానా కూడా ఉంది.ఇండస్ట్రీలో ఎక్కువగా headweight ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఇలియాన మాత్రమేనట.సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక తనకు డేట్స్ తో ఒక పేచీ అయితే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రమోషన్స్ కి రమ్మంటే రాకుండా ఇంకొక పేచి.

ఇంకా షూటింగ్ మధ్యలో తనకు నచ్చకపోతే మధ్యలో వెళ్లిపోవడం, ఎదుట ఎవ్వరు ఉన్నారని కూడా చూసుకోకుండా తనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం ఇలా ఇలియానా ఎన్నోసార్లు ఎంతోమంది ప్రముఖులను ఇబ్బంది పెట్టిందట.అందుకే తెలుగు సినిమాకి నన్ను భరించే రేంజ్ లేదనుకొని ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళిపోయింది

అదండీ మన తెలుగు సినిమా హీరోయిన్స్ లో హెడ్ వెయిట్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్!

.

#Press Meet #Sai Pallavi #NaturalActing #Ileana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు