ఓహో.. వరుస విజయాలతో.. గోల్డెన్ లెగ్ అనిపించుకుంటున్న హీరోయిన్లు వీళ్ళే?

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా విజయాలతో దూసుకుపోవటం అంటే అది మామూలు విషయం కాదు.ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి.

 Tollywood Heroines Who Are Getting Continuous Hits Pooja Hegde Krithi Shetty Ras-TeluguStop.com

ఇక అన్ని కలిసి వస్తేనే హిట్ కొట్టడం సాధ్యమవుతుంది.అయితే ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ముద్దుగుమ్మలు వరుస విజయాలతో దూసుకుపోతూ ఇక ఇప్పుడు సక్సెస్ కు చిరునామాగా మారిపోయారు.అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పూజా హెగ్డే :

ఒక లైలా కోసం సినిమా లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.కానీ ఏ సినిమా కూడా సరైన విజయం సాధించలేక పోయింది.దీంతో ఈ అమ్మడు ఐరన్ లెగ్ అనుకున్నారు అందరు.ఇప్పుడు మాత్రం దక్షిణాది చిత్ర పరిశ్రమ లో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది పూజా హెగ్డే.

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుని దూసుకుపోతుంది పూజా హెగ్డే.

కృతి శెట్టి :

Telugu Hits, Faria Abdulla, Krithi Shetty, Pooja Hegde, Sai Pallavi, Shruthi Has

ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కాలు పెట్టిందో లేదో నక్క తోక తొక్కేసింది.ఈ అమ్మడు నటించిన మొదటి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ఈ అమ్మడికి కూడా ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది.ఇక ఇటీవలే గత ఏడాది శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.మొన్నటికి మొన్న బంగార్రాజు అనే సినిమాతో నాగచైతన్య కు జోడిగా నటించిన కృతి శెట్టి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని సూపర్ స్పీడ్ తో దూసుకుపోతోంది.

రష్మిక మందన :

Telugu Hits, Faria Abdulla, Krithi Shetty, Pooja Hegde, Sai Pallavi, Shruthi Has

చలో సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే హిట్ తన ఖాతాలో వేసుకుంది.ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడమే కాదు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.ఇక అటు వెంటనే సరిలేరు నీకెవ్వరు ఇటీవలే పుష్ప లాంటి సినిమాతో మరిన్ని బ్లాక్ బస్టర్ లను సాధించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

సాయి పల్లవి :

Telugu Hits, Faria Abdulla, Krithi Shetty, Pooja Hegde, Sai Pallavi, Shruthi Has

ఫిదా సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే తెలంగాణ యాస లో డబ్బింగ్ చెప్పి అందరినీ ఫిదా చేసింది.నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది.ఇక గత ఏడాది లవ్ స్టోరీ, శ్యాం సింగరాయ్ సినిమాలతో మళ్లీ వరుసగా విజయాలు ఖాతాలో వేసుకోవడం మొదలుపెట్టింది ఈ సొగసరి.

శృతిహాసన్ :

Telugu Hits, Faria Abdulla, Krithi Shetty, Pooja Hegde, Sai Pallavi, Shruthi Has

అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైంది.మొదటి సినిమా అట్టర్ ప్లాప్ సినిమా ప్లాప్ అయింది కానీ ఈ అమ్మడి నటనకు మాత్రం మంచి మార్కులు దక్కాయ్.తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ కొనసాగిన శృతి హాసన్ ఆ తర్వాత కొన్నాళ్లు చిత్ర పరి శ్రమకు దూరమైపోయింది.ఇక గత ఏడాది మాత్రం క్రాక్ తో ఎంట్రీ ఇచ్చి మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.వకీల్ సాబ్ సినిమాతో మరో బ్లాక్బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది.

ఫరియా అబ్దుల్లా :

Telugu Hits, Faria Abdulla, Krithi Shetty, Pooja Hegde, Sai Pallavi, Shruthi Has

చిన్న సినిమా జాతిరత్నాలు తో హీరోయిన్ గా పరిచయమైంది.ఇక తెలుగు ప్రేక్షకులందరీ హృదయాలకు చిట్టి అనే పేరుతో దగ్గరయింది.ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఫరియా అబ్దుల్లా.

మొన్నటికి మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటించి హిట్టు కొట్టిన ఫరియా అబ్దుల్లా ఇక ఇటీవల బంగార్రాజు సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ తో కూడా ప్రేక్షకులను అలరించింది.ఈ హీరోయిన్లు అందరూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube