సినిమాల్లో నటించడం అంటే.అంత తేలిక విషయం కాదు.
ఏ పాత్ర పోషించాల్సి వచ్చినా సరే అనాలి.క్యారెక్టర్ లో జీవించాలి.
అందుకే నటన అనేది అంత సులభం కాదు.ఇక సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు.
అందులోనూ మూగ, చెవుడు, గుడ్డి పాత్రలు చేయడం సులభం కాదు.అలాంటి పాత్రను నిశ్శబ్ధం మూవీలో అనుష్క ఎంతో ఈజీగా చేసింది.
నెట్రికన్ మూవీలో నయనతార బ్లైండ్ రోల్ పోషించింది.వీళ్లే కాదు.
పలువురు నటీ మణులు దివ్యాంగుల పాత్రలో నటించి మెప్పించారు.ఇంతకూ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
అనుష్క
నిశ్శబ్దం మూవీలో దివ్యాంగురాలైన మూగ, బధిర పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది.
నయనతార
నెట్రికన్ సినిమాలో అంధురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది.
పాయల్ రాజ్‌పుత్
వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా డిస్కో రాజా.ఈసినిమాలో మూగ అమ్మాయి పాత్రలో మెప్పించింది పాయల్ రాజ్‌పుత్.
రమ్యకృష్ణ
అల్లుడు గారు సినిమాలో రమ్యకృష్ణ మూగ అమ్మాయి పాత్రలో నటించింది.
విజయశాంతి
జానకి రాముడు సినిమాలో కాసేపు మూగ అమ్మాయిగా నటించి విజయశాంతి వారెవ్వా అనిపించింది.
సిమ్రాన్
నాగార్జున హీరోగా నటించిన నువ్వు వస్తావని చిత్రంలో అంధురాలి పాత్రలో నటించింది సిమ్రాన్.
మీనా
సిరివెన్నెల చిత్రంలో మీనా బాలనటిగా అంధురాలి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయయింది.
లయ
ప్రేమించు సినిమాలో అంధురాలి పాత్రలో అద్బుతంగా నటించింది లయ.
రాశి
పెళ్లి పందిరి సినిమాలో అంధురాలి పాత్రలో నటించి మెప్పించింది హీరోయిన్ రాశి.
శ్రీదేవి
వసంత కోకిలలో మతిస్థిమితం లేని పాత్రలో నటించి మెప్పించింది శ్రీదేవి.ఆ తర్వాత ఎస్పీ పరశురామ్ చిత్రంలో అంధురాలి పాత్రలో ఒదిగిపోయింది.
సుహాసిని
సిరివెన్నెల చిత్రంలో మూగ అమ్మాయి పాత్రలో నటించింది సుహాసిని.
జ్యోతిక
సుందరాంగుడు చిత్రంలో బ్లైండ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది జ్యోతిక.
జయ ప్రద
ప్రేమ బంధం సినిమాలో అంధురాలి పాత్రలో మెప్పించిన జయప్రద.సిరిసిరి మువ్వ మూవీలో మూగ పాత్రలో నటించింది.
షావుకారు జానకీ
మంచి మనుసులు చిత్రంలో షావుకారు జానకీ అంధురాలి పాత్రలో నటించి మెప్పించింది.