చాలా సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే ఉంటారు.లేదంటే ఇద్దరుంటారు.
ఒకరు ఫ్లాష్ బ్యాక్ లో ఉంటే మరొకరు ప్రజెంట్ లో ఉంటారు.మరికొన్ని సినిమాల్లో ఒకే హీరోకు ఇద్దరు భార్యలుగా చేసిన సందర్భాలూ ఉన్నాయి.
మరికొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ సొంత అక్కా, చెల్లెళ్లుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.తక్కువ సినిమాల్లోనే ఇలా జరిగినప్పటికీ.
ప్రేక్షకులను మాత్రం భలే ఆకట్టుకున్నారు.అలా ఇద్దరు హీరోయిన్లు అక్కా చెల్లెలిగా చేసిన సినిమాలు ఏంటో? ఆ హీరోయిన్లు ఎవరో? ఇప్పుడు చూద్దాం.
ఐశ్వర్య రాయ్-టబు
రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ప్రియురాలు పిలిచింది సినిమాలో ఐశ్వర్య, టబు అక్కి చెల్లెళ్లుగా కనిపించారు.
మీనా- నగ్మా
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి అల్లుడు సినిమాలో వీళ్లిద్దరు సొంత సిస్టర్స్ గా నటించారు.
రవళి- దీప్తి భట్నాగర్
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన పెళ్లి సందడి సినిమాలో రవళి, దీప్తి భట్నాగర్ సొంత అక్కా చెల్లెళ్లుగా యాక్ట్ చేశారు.
లయ- గజాల
వి.ఆర్.ప్రతాప్ సినిమా నాలో ఉన్న ప్రేమ సినిమాలో నటించినఈ హీరోయిన్లు.అక్కాచెల్లెళ్ల క్యారెక్టర్లు చేశారు.
షీలా- పూనం బజ్వా
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు మూవీలో వీరిద్దరు అక్కా చెల్లెళ్లుగా కనిపించారు.
తమన్నా- ఆండ్రియా
కిశోర్ కుమార్ పార్ధసాని అలియాస్ డాలీ మూవీ తడాఖాలో వీళ్లు అక్కా చెల్లెళ్లుగా కనిపించారు.
త్రిష-సంజన లగ్రాని
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన బుజ్జిగాడు సినిమాలో వీళ్లు సిస్టర్స్ గా కనిపించారు.
పూజా హెగ్డే-ఇషా రెబ్బా
త్రివిక్రమ్ మూవీ అరవింద సమేత సినిమాలో వీరిద్దరు సిస్టర్స్ గా చేశారు.
సమంత-ప్రణీత
అత్తారింటికి దారేది మూవీలో సమంత, ప్రణీత అక్కా చెల్లెళ్లుగా నటించారు.
ఇలియానా-కమలినీ ముఖర్జీ
త్రివిక్రమ్ మూవీ జల్సాలో ఇలియానా, కమలినీ ముఖర్జీ సిస్టర్స్ క్యారెక్టర్ చేశారు.
తమన్నా- మెహ్రీన్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 మూవీలో వీరిద్దరు అక్కా చెల్లిగా నటించారు.సూపర్ యాక్టింగ్ తో అదరగొట్టారు.