మన తెలుగు హీరోయిన్లు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నారో తెలుసా.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఏవరంటే..  

Tollywood Heroines Remunerations-nayanthara,remunerations,samantha,అనుష్క,తమన్నా

ఒక్కప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలు కూడా తీసుకోనంతగా రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు ప్రస్తుత తెలుగు హీరోయిన్లు. వీరిలో సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకోలేని నార్త్ అమ్మాయిలకు కోట్ల పారితోషికం ఇస్తున్నారు మన టాలీవుడ్ నిర్మాతలు.మన తెలుగు పరిశ్రమలో అప్పట్లో మల్లీశ్వరి సినిమాకి హీరో తో సమానంగా పారితోషికం తీసుకొని వార్తల్లో నిలిచింది కత్రినా కైఫ్ , 2004 – 05 సమయంలొనే కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంది.ఇప్పుడు ఆమెకి ధీటుగా ప్రస్తుత హీరోయిన్ లు ఒక్కో సినిమాకు నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు..

మన తెలుగు హీరోయిన్లు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నారో తెలుసా.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఏవరంటే..-Tollywood Heroines Remunerations

1)కోటి రూపాయల భామలు నయన తార , అనుష్క

ప్రస్తుతం 35 ఏళ్ళకి పై ఉన్న నటీమణులు నయనతార , అనుష్క లు ఇప్పటికి ఒక సినిమా చేస్తే కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అనుష్క ఒక్కో సినిమా కి 3 నుండి 4 కోట్లు తీసుకుంటుండగా , సైరా సినిమా కోసం నయన తార ఏకంగా 3.5 కోట్లు తీసుకుంటుందట.

2)సమంత అక్కినేని

పెళ్ళైనక మరిన్ని సినిమాలు తీస్తూ హిట్ లు కొడుతున్న సమంత ఈ మధ్య విడుదలై నాగ చైతన్య కి భారీ విజయాన్ని అందించిన మజిలీ సినిమా కోసం ఆమె 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది.

3)కాజల్ అగర్వాల్

ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు దాటిన కాజల్ కి ఇంకా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది , ప్రస్తుతం కాజల్ సినిమాకి 2 కోట్ల వరకు పారితోషికం గా తీసుకుంటుంది.