ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం, విడిపోవడం సర్వసాధారణమైన విషయం అయ్యింది.ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో.
నచ్చితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, నచ్చకపోతే విడిపోవడం అనే విషయం చాలా కామన్ అయ్యింది.ఇటువంటి పెళ్లి పెటాకులు చాలా సెలబ్రిటీల జీవితాల్లో జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
సెలబ్రిటీలు ప్రేమించినంత కాలం మంచిగానే ఉంటారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ కొంత కాలంలోనే విడాకులు తీసుకుంటుంటారు.ఏళ్లతరబడి ప్రేమించుకున్న వారే నెలలు గడవక ముందే పెళ్లి బంధాలను తెంచుకుంటున్నారు.మరి అలా దర్శకులను షూటింగ్లలో చూసి వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత నీతో సంసారం చేయానంటూ విడాకులు తీసుకున్న హీరోయిన్లు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
1.అమలా పాల్
2011లో దైవ తిరుమంగళం అనే ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అమలాపాల్.దర్శకుడు ఎల్.విజయ్ తో ప్రేమాయణం నడుపుతున్నారని గాసిప్స్ గుప్పుమన్నాయి.అయితే ఆ పుకార్లను నిజం చేస్తూ అమలాపాల్ విజయ్ ని 2014 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.కానీ పెళ్లి చేసుకున్న 2 ఏళ్ళకే వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు.
2.రాధిక
హీరోయిన్ రాధిక.దర్శకుడు, నటుడు అయిన ప్రతాప్ పొతేన్ తో కలిసి ఒక సినిమాని నిర్మించారు.ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది.అయితే ఈ సినిమా సక్సెస్ అయిన సమయంలో రాధిక.ప్రతాప్ పొతేన్ పై మనసు పారేసుకున్నారు.ఆ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు కానీ ఏడాదిలోపే రాధిక ప్రతాప్ కి విడాకులు ఇచ్చేశారు.
3.కబడ్డీ కల్యాణి
కేరళ కుట్టి కల్యాణి ని కావేరి అని కూడా పిలుస్తుంటారు.ఈమె దర్శకుడు సూర్య కిరణ్ ని కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు.ఆ వెంటనే మనసు పారేసుకున్నారు.
ఇంట్లో తమ ప్రేమ విషయం చెప్పి పెద్దలను ఒప్పించి మరీ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.కానీ పెళ్లయిన మొదటి రోజే తన భర్త సూర్య కిరణ్ ఓ దద్దమ్మ, సోమరిపోతు అని తెలుసుకున్న కల్యాణి వెంటనే సూర్య కిరణ్ కి విడాకులు ఇచ్చి ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
4.రేవతి
హీరోయిన్ రేవతి దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ లో ఇండివిడ్యువాలిటీ నచ్చిందని ఆయనను 1986లో పెళ్లి చేసుకున్నారు.కానీ పెళ్లయిన తర్వాత అదే ఇండివిడ్యువాలిటీ అడ్డు రావడంతో ఆమె ఆయనకు దూరంగా ఉండటం ప్రారంభించారు.2005లో వాళ్ళిద్దరు ఒంటరి జీవితం గడపడం ప్రారంభించారు.2013లో వాళ్ళిద్దరూ అదనపు ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు.రేవతి కి సంసారం పట్ల ఆసక్తి లేదని సురేష్ చంద్ర చెబుతుంటారు.
5.సీత
అలనాటి హీరోయిన్ సీత.ఆర్.పార్థివన్ అనే ఒక దర్శకుడిని షూటింగ్ సమయం లో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.అయితే వీళ్లిద్దరూ పెళ్లి అయి పిల్లలు పుట్టేంత వరకు బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.సీత మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమెపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఆమె రెండవ సారి బుల్లితెర నటుడైన సీత ని పెళ్లి చేసుకున్నారు కానీ 2016 లో విడాకులు తీసుకున్నారు.