కరోనా దెబ్బ టాలీవుడ్ హీరోయిన్ల మీద గట్టిగా పడింది.ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి.
చాలా మంది జీవితాలను ఆగం చేసింది.ఇప్పుడిప్పుడే ప్రపంచం మళ్లీ కోలుకుంటుంది.
అయినా ఈ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదు.అటు సినిమా పరిశ్రమలోనూ ఈ మహమ్మారి ప్రకంపనలు రేపింది.
దీని మూలంగా సినిమా రంగానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు.అటు మునుపటి మాదిరిగి కోట్ల కు కోట్ల రూపాయలు పారితోషకం ఇవ్వలేమంటున్నారు ప్రొడ్యూసర్లు.
ముఖ్యంగా హీరోయిన్ల పారితోషకంలో భారీగా కోత విధిస్తున్నారు.సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మంది రెమ్యునరేషన్ సైతం తగ్గిపోయింది.అయితే కరోనా కారణంగా ఏ హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పూజా హెగ్డే
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది.పలువురు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తుంది.ఇప్పటి వరకు ఈమె సుమారు రెండు కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ ఉండేది.కానీ కరోనా అనంతరం ఈమె పారితోషకం భారీగా తగ్గిపోయింది.
సాయి పల్లవి
కరోనా కష్టకాలంలో ఈమె పారితోషకం తనకు తానుగా తగ్గించుకుంది.విరాట్ పర్వం, లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు గతంలో కంటే తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంది.
సమంత
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా కూడా తన రెమ్యునరేషన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గింది.దీంతో పలు తమిళ, తెలుగు సినిమాల్లో కథ నచ్చితే రెమ్యునరేషన్ సైతం తగ్గించుకునేందుకు వెనుకాడ్డం లేదు.
నయనతార
ఈ అమ్మడు కరోనాకు ముందు వరకు సుమారు సినిమాకు మూడు కోట్లు తీసుకునేది.కానీ కరోనా అనంతరం తనకు తానుగా చాలా వరకు రెమ్యునరేషన్ తగ్గించుకుంది.
బాహుబలి సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కరోనాకు ముందు వరకు మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది.
కానీ ఆ తర్వాత సగానికి పడిపోయింది.అంటే కోటిన్నరకు తగ్గినట్లు తెలుస్తోంది.