దర్శకుల చేతిలో దారుణ అవమానానికి గురైన హీరోయిన్లు ఎవరో తెలుసా?

రెండున్నర గంటల సినిమా కోసం మూడు నాలుగు గంటలు లేదంటే ఐదు గంటల షూటింగ్ ఫీడ్ రెడీ చేస్తారు.దాన్ని పద్దతిగా ఎడిటింగ్ చేసి.

 Tollywood Heroines Insulted By Directors, Tollywood Heroines, Insulted By Direct-TeluguStop.com

సినిమాకు ఓ రూపు తెస్తారు వీడియో ఎడిటర్లు.అయితే ఒక్కోసారి ఈ ఎడిటింగ్ అనేది తక్కువగానే ఉంటుంది.

మరోసారి సీన్లు, క్యారెక్టర్లు కూడా లేచిపోయే పరిస్థితి ఉంటుంది.అలా కొన్ని సార్లు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే హీరోయిన్ల క్యారెక్టర్ల మీదే ఎడిటింగ్ దెబ్బ పడిన సందర్భాలున్నాయి.

దీన్ని ఘోర అవమానంగా ఫీలయ్యారు కొందరు హీరోయిన్లు.ఇంతకీ ఇలాంటి అవమానాలకు గురైన హీరోయిన్లు ఎవరు? ఆ సినిమాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేరాఫ్ సూర్య – మెహ్రీన్ కౌర్


సందీప్ కిషన్ హీరో, మెహ్రీన్ కౌర్ హీరోయిన్ కేరాఫ్ సూర్య అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ అని అనుకుంది మెహ్రీన్.

షూటింగ్ అయ్యింది.సినిమా విడుదల అయ్యింది.

అయితే హీరోయిన్ పాత్ర చాలా ఎక్కువగా ఉందని కట్ చేశారు.సినిమా రిలీజ్ తర్వాత తన సీన్స్ కట్ చేయడాన్ని ఆమె అవమానంగా ఫీలయ్యారు.

ఖాకీ – రకుల్ ప్రీత్ సింగ్


Telugu Care Surya, Directors, Karthi, Khaki, Mehreen, Sulthan, Sundeep Kishan, T

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది.కార్తి హీరోగా వచ్చిన ఖాకీ సినిమాలో రకుల్ సీన్లు చాలా తీసేశారు.హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు అతిగా ఉన్నాయని రిలీజ్ తర్వాత తొలగించారు.దీనిపై రకుల్ చాలా బాధ పడిందట.అటు కార్తితో నటించిన మరో సినిమా దేవ్ లోనూ ఇలాంటి పరిస్థితే వచ్చిందట.

సుల్తాన్ – రష్మిక మందానా


Telugu Care Surya, Directors, Karthi, Khaki, Mehreen, Sulthan, Sundeep Kishan, T

మరో టాప్ బ్యూటీ రష్మికా మందానా విషయంలోనూ ఇదే రకమైన అవమానం జరిగిందట.తాజాగా తమిళంలో రిలీజైన సుల్తాన్ సినిమాలో రష్మికకు సంబంధించిన కొన్ని సీన్లు రిలీజ్ కు ముందే తొలగించారట.అటు సినిమా రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని సీన్లు లేపేశారట.

దీంతో రష్మిక అవమానంగా ఫీలైందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube