ప్రేమించిన వాడిని వదిలేస్తే.. కానీ సినిమాల్లో హిట్ కొట్టని టాలీవుడ్ హీరోయిన్స్  

Tollywood heroines Hit Movies after Breakup ,shruti hassan, - Telugu Amala Paul, Andrea Jeremiah, Nayanthara, Shruti Hassan, Telugu Actress Anjali, Tollywood Heroines, Tollywood Heroines Hit Movies After Breakup

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం” అనే సాంగ్ ని కచ్చితంగా అందరూ ఇష్టపడతారు.నిజంగానే ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో దానితో ఒక్కసారి బ్రేక్ అప్ అయితే అది అబ్బాయికైనా అమ్మాయికైనా ఎంతో బాధ.

TeluguStop.com - Tollywood Heroines Hit Movies After Breakup

అలాగే లైఫ్ మీద ఆశలు పోయి డిప్రెషన్ కి వెళ్లడం జరుగుతుంది.అయితే కొంతమంది హీరోయిన్ల జీవితాల్లో మాత్రం ఇది రివర్సు అయింది.

ఇప్పుడు మన తెలుసుకోబోయే హీరోయిన్స్ జీవితం ప్రేమలో, పెళ్ళిలో విఫలం అయ్యాకే గాడినపడింది.బ్రేకప్ అయ్యాకే వీళ్ళు ఇంకొంచం స్ట్రాంగ్ అయి వాళ్ళ జీవితంలో సక్సెస్ ని అందుకున్నారు.

TeluguStop.com - ప్రేమించిన వాడిని వదిలేస్తే.. కానీ సినిమాల్లో హిట్ కొట్టని టాలీవుడ్ హీరోయిన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ హీరోయిన్స్ ఎవరు? బ్రేకప్ అయ్యాక వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులేంటి లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ లిస్ట్ లో ముందుగా నయనతార పేరు వినిపిస్తోంది.నయనతార ఇప్పటివరకు మూడు సార్లు ప్రేమలో పడింది.

రెండుసార్లు విఫలమైంది.హీరో శింబుతో, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో అండ్ అందరికి బాగా తెలిసిన ప్రభుదేవాతో.

ప్రేమలో ఉండి అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది.ప్రభుదేవాతో 2011లో విడిపోయింది నయనతార.

అయితే ఇలా మూడు సార్లు ప్రేమలో విఫలమైన తర్వాతే ఆమె కెరీర్ టాప్ గేర్‌లో దూసుకుపోయింది.ఇప్పుడు కూడా చేతి నిండా సినిమాలతో బిజి బిజిగా ఉంది.

అయితే ఇప్పుడు నయనతారకి 36 సంవత్సరాలు ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ఇక ఆతర్వాత అమలా పాల్ గురించి కూడా మాట్లాడుకోవాలి.ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కి పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత గాని అంతగా కెరియర్ ముందుకు సాగలేదు.బట్ ఎప్పుడైతే వాళ్ళ ఆయనతో విడాకులు తీసుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందో అప్పుడు అమలాపాల్ కెరీర్ దూసుకుపోయింది.

ఇప్పుడు ఈమె కూడా చేతి నిండా సినిమాలతో బిజి అయిపోయింది.

కమల హస్సన్ కూతురు శృతి హాసన్ సినిమా కెరియర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అంటూ ఈమె హీరోయిన్ గా చేస్తే సినిమా కచ్చితంగా ప్లాప్ అయిద్ది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దయతో గబ్బసింగ్ సినిమా చేసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈమెకి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.అయితే పవన్ సినిమాతో బ్రేక్ వచ్చిన శృతికి పవన్ సినిమా కాటమరాయుడు తర్వాతే మళ్ళీ అవకాశాలు లేకుండా పోయాయి.

ఆ సినిమా తర్వాత శృతికి తెలుగులో పెద్దగా సినిమాలు రాలేదు.దాంతో కొన్నిరోజులు బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్‌తో రిలేషన్ లో ఉంది.ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.అయితే కొన్ని కారణాల వలన ఆ రేలషన్ బ్రేకప్ అవ్వడంతో శృతి మళ్ళీ సినిమాల మీద ద్రుష్టి పెట్టింది.

ఆ ప్రేమ బ్రేకప్ అవ్వడం వలనో ఏమో తెలియదుగాని ఇప్పుడు అమ్మడుకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.తెలుగులో ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తుంది

ఇక ప్రెసెంట్ తెలుగు టాప్ హీరోయిన్స్ లో ఒకరైన రష్మిక మందన్నకి కూడా బ్రేకప్ అయ్యాకే వరసగా సినిమాలు రావడం మొదలైంది.ఈమె అందానికి అదిరిపోయే నటనకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ తెలుగు కుర్ర కారు గుండెల్ని పిండేస్తుంది ఈ కన్నడ పాపా.ఇక ఈమె బ్రేకప్ చేసుకున్నది ఎవరితో అంటే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో.

ఆయన్ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాక చిన్న చిన్న కారణాల వలన అది క్యాన్సిల్ చేసుకుంది.ఇక తర్వాత ఆమె అదృష్టం తిరిగిపోయి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన్న.

ఇక ఆతర్వాత లిస్ట్ లో మన తెలుగింటి అమ్మాయి అయిన అంజలి కూడా ఉంది.ఈమె తమిళ హీరో జైతో విడిపోయిన దగ్గర నుండి అంజలి కెరీర్‌ బాగా పుంజుకుంది.ఇటీవలే అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో మంచి పాత్రలో నటించి అందరిని బాగా అలరించింది.

ఇక హీరో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఆండ్రియా ఆ తర్వాత నాగచైతన్య సునీల్ నటించిన తడాఖా సినిమాలో కూడా మెరిసింది.ఇంకా తమిళ్ ఇండస్ట్రీలో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించిన ఆండ్రియా.ఆయనతో విడిపోయిన తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది.34 ఏళ్ల ప్రాయంలో తెలుగు, తమిళ్ అండ్ మలయాళం ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది.

.

#TeluguActress #Andrea Jeremiah #Nayanthara #Shruti Hassan #Amala Paul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు