వయసు పెరిగినా.తనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు అని నిరూపిస్తున్నాడు మెగా స్టార్ చిరంజీవి.
వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు కూడా అందనంత స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు.రాజకీయాల నుంచి మళ్లీ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన చిరంజీవి.
.తొలుత కాస్త నెమ్మదిగా సినిమాలు చేసినా.రాను రాను స్పీడ్ పెంచాడు.ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు.ప్రస్తుతం ఆయన నటించిన సినిమాలు వరుసగా విడుదలకు రెడీ అవుతున్నాయి.ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.
అటు గాడ్ ఫాదర్, మెగా 154, భోళా శంకర్, మెగా 156 సినిమాలు వరుసగా లైనప్ లో ఉన్నాయి.
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఏ హీరోయిన్లతో అయితే జత కట్టాడో మళ్లీ వారితోనే జోడీ కడుతున్నాడు.
ఖైదీ నెంబర్ 150లో క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తో ఆడిపాడాడు.ఆ ముద్దుగుమ్మే ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తోంది.ఇక సైరా నర్సింహారెడ్డి సినిమాలో నటించిన నయనతార, తమన్నా భాటియా చిరుతో మరోసారి కలిసి నటిస్తున్నారు.ఈ ఇద్దరు గాడ్ ఫాదర్ సినిమాలో చేస్తున్నారు.
గాడ్ ఫాదర్ సినిమాలో నయన తార కీలక పాత్ర పోషిస్తుండగా. భోళా శంకర్ సినిమాలో తమన్నా జోడీ కడుతోంది.
గతంలో తనకు కలిసి వచ్చిన హీరోయిన్లు ఈ సారి కూడా కలిసి వస్తారని చిరంజీవి భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో చిరు సినిమాల్లో అత్యధిక గ్రాసర్ రాబట్టిన సినిమాలు ఖైదీ నెంబర్ 150, సైరా విక్టరీలో మంచి పాత్రలు పోషించిన కాజల్, నయనతార, తమన్నా.రాబోయే ఆయన సినిమాలు ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలకు కూడా ప్లస్ కావొచ్చని సినీ పండితులు అభిప్రాయ పడుతున్నారు.అటు ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
అటు గాడ్ ఫాదర్ తో పాటు భోళా శంకర్ సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇందుకోసం సినిమా యూనిట్ శరవేగంగా సినిమా షూటింగ్ పనులు కొనసాగిస్తుంది.