కరోనా కష్టకాలంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లు తమ సేవా గుణాన్ని చాటుకుంటున్నారు.కరోనా బాధితులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు.
కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్నారు.ఎవరికి వారు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు.
కొంత మంది కరోనా ఒత్తిడి ఎలా తట్టుకోవాలో చెబుతుంటే.మరికొంత మంది ఏకంగా ఫండ్ రైజింగ్ చేస్తూ కరోనా రోగులకు అండగా నిలుస్తున్నారు.
తమ సినిమాలతో జనాలను అలరించడమే కాకుండా.సమాజం పట్ల బాధ్యతగా ఉంటామంటున్నారు నటీమణులు.కొవిడ్ పై యుద్ధంలో తోచిన సాయం చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యోగాతో ఎలా ప్రశాంతంగా ఉండాలో చెప్తుంది.
యోగా టిప్స్ ను షేర్ చేస్తుంది.కరోనా విజృంభిస్తున్న సమయంలో చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు.
భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుంచి విముక్తి పొందేలా యోగ నిద్ర యోగాసనాన్ని అందరికి పరిచయం చేసింది.
ఒత్తిడికి దూరమై రిలాక్స్ కావొచ్చని చెప్తోంది.అంతకు ముందు కూడా ఫండ్ రైజింగ్ లో తన వంతు సాయం చేసింది రకుల్.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా కరోనా కట్టడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.కోవిడ్ జాగ్రత్తలు చెబుతూనే… డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది.
ఫండ్స్ కలెక్ట్ చేస్తూ.కరోనా రోగులకు బాసటగా నిలుస్తుంది.
ఫిజికల్ డిస్టెంన్స్ పాటిస్తూ మాస్స్ మస్ట్ గా పెట్టుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలంటోంది.మరో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా గతంలో కరోనా నుంచి కోలుకున్నాక.
తాను ఆ పరిస్థితుల్లో ఏం చేసిందో వివరించింది.
తన అభిమానులకు సూచనలు చేసింది.తాజాగా కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.అందరూ ఆక్సీమీటర్ వాడాలని.
అది ఎలా వాడాలో కూడా ఓ వీడియో చేసి చూపించింది.భయపడకుండా ధైర్యంగా ఉంటే.
కరోనా ఏం చేయలేదంటోంది.వీరితో పాటు పలువురు హీరోలు సైతం కరోనాపై జనాలకు అవగాహణ కల్పిస్తున్నారు.