ఒకప్పుడు గ్లామర్ పాత్రలు పోషించేందుకే హీరోయిన్లు ఇష్టపడేవారు.తమ అందాలను వెండితెర మీద ఆరబోస్తేనే అవకాశాలు ఎక్కువ వస్తాయనే ఆలోచనలో ఉండేవారు.
వారి ఆలోచనలకు తగ్గట్లే దర్శకులు హీరోయిన్ల అంగాలను తమ కెమెరా కన్నుతో తడిమేవారు.కానీ ప్రస్తుతం హీరోయిన్ల మైండ్ సెట్ మారిపోయింది.
అందం కన్నా అభినయానిదే కీ రోల్ అని భావిస్తున్నారు.అందుకే ప్రస్తుతం కొత్తదారిలో పయణిస్తున్నారు.
రెమ్యునరేషన్ తగ్గిన ఫర్వాలేదు కానీ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే కావాలంటున్నారు.కాజల్అందాల తార కాజల్ పెళ్లి తర్వాత బాగా మారింది.
ఆమె ఆలోచనా తీరులోనూ మార్పు వచ్చింది.ఇకపై తను చేయబోయే సినిమాల్లో డిఫరెంట్ స్టోరీలు ఉండేలా చూడాలనుకుంటుంది.
ఇప్పటి వరకు అందాలు ఆరబోసిన ఈ అమ్మడు ఇప్పుడు కొత్త రోల్స్ లో నటించాలి అనుకుంటుంది.అంతేకాదు తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ ఆచార్య, నాగ్-ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్ లో వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది.ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మెహ్రీన్
కొద్దిరోజుల క్రితమే మెహ్రీన్ కు వివాహ నిశ్చితార్థం జరిగింది.అయితే పెళ్లికొడుక్కి కరోనా సోకింది.దీంతో ఆ పెళ్లి కాస్తా వాయిదా పడింది.అయితే ఈ సమయంలో మరిన్ని సినిమాలకు ఓకే చేయాలని భావిస్తోంది.అందుకోసం పలు కథలు వింటుంది.ప్రస్తుతం ఆమె ఎఫ్-2 సీక్వెల్ మూవీలో నటిస్తోంది.ఇమ్మానుయెల్
ఇంతకు ముందు కేవలం స్టార్స్ సినిమాలకే ఓకే చెప్పేది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఆ నిబంధనను తొలగించింది.ఇప్పుడు ఎవరైనా ఓకే అంటుంది.ఇప్పటికే బెల్లకొండ సరసన ఆడి పాడిన ఈ అమ్మడు అల్లు శిరీష్ సినిమా ప్రేమ కాదంటలో నటిస్తోంది.
మలయాళీ భామలు
ఇంక మలయాళీ భామల ఆలోచనలు సైతం కొత్తగా ముందుకు సాగుతున్నాయి.నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.పవన్ కల్యాణ్ – రానా రీమేక్ మూవీలో నిత్యా మీనన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.స్కైల్యాబ్, గమనం లాంటి సరికొత్త సినిమాల్లో నటిస్తోంది రింగుల జుట్టు అమ్మాయి.
వకీల్ సాబ్ లో నివేథా థామస్ నటించగా శాకిని – ఢాకిని అనే మరో మూవీకి ఆమె సైన్ చేసింది.అనుపమా పరమేశ్వర్ 18 పేజీస్ సినిమాతో పాటు దిల్ రాజు రౌడీ బాయ్స్ మూవీలో నటించబోతుంది.